ఆల్రెడీ ఒక భాషలో వచ్చిన సినిమాని మరొక భాషలో రీమేక్ చేస్తూ ఉండడం సహజం. అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే ఒక భాషలో ఒక హీరో కి సంబంధించిన బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. మరొక భాషలో మరొక హీరో కి సంబంధించిన బాడీ లాంగ్వేజ్ ఉంటుంది కాబట్టి అక్కడి ప్రేక్షకులకు నచ్చే విధంగా హీరోలు తమ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్లు రీమేక్ సినిమాలు చేసి విడుదల చేస్తూ ఉంటారు. తద్వారా పోలికలు అనేవి కనబడకుండా సినిమాలు వారి వారి భాషల్లో హిట్ అవుతుంటాయి.

కానీ ఒకే భాషలో ఇద్దరు హీరోలు ఒకే సినిమాను చేస్తే తప్పకుండా పోలికలు చూపిస్తారు. అందులోనూ ఓ పాన్ ఇండియా స్టార్ చేసిన సినిమాను ఓ కుర్రహీరో చేసేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ లో టాలీవుడ్ లో సూపర్ హిట్టైన చత్రపతి సినిమా రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. మొదట్లో బెల్లంకొండ శ్రీనివాస్ ఈ సినిమాని రీమేక్ చేయడం ఎంటా అని అందరు గుసగుసలాడుతున్నారు. కానీ ఆ తర్వాత మనోడే కదా బాలీవుడ్ లోకి వెళ్తున్నాడు అని ఎంకరేజ్ చేశారు.

అయితే వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టాలీవుడ్ సినిమా రేంజ్ లో వస్తుందా అన్న సందేహాలు వ్యక్తపరుస్తున్నారు చత్రపతి సినిమా అభిమానులు. ఈ సినిమా ద్వారానే ఇటు రాజమౌళి అటు ప్రభాస్ స్టార్లుగా ఎదిగారు. అప్పట్లో వీరి డెడికేషన్ ఓ రేంజ్ లో ఉంది కాబట్టే ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. మరి ఇప్పుడిప్పుడే హీరోగా ఎదుగుతున్న బెల్లంకొండ శ్రీనివాస్,  ఫేడ్ అవుట్ అయిపోయిన వినాయక్ ఈ సినిమాను ఎలా తీస్తారో చూడాలి. ఇక తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం బెల్లంకొండ శ్రీనివాస్ ప్రభాస్ రేంజ్ లో తన యాక్షన్ తో మెప్పించలేక పోతున్నాడు విమర్శలు వినిపిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: