
టాలీవుడ్ లో అత్యధిక సక్సెస్ రేటు కలిగిన హీరో విక్టరీ వెంకటేష్. ఆయన తన తొలి సినిమా నుంచి ఇప్పటి వరకు ఎక్కువ శాతం విజయాలు నమోదు చేసుకుంటూ సార్ హీరోగా ఎదిగాడు. ప్రస్తుతం ఆయన హీరోగా నటించిన నారప్ప సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ అయిన అసురన్ సినిమాకి రీమేక్ కాగా తెలుగు లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సురేష్ బాబు ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తుండగా మణిశర్మ సంగీతం హైలైట్ గా నిలువనుందని తెలుస్తోంది.
ప్రియమణి కథానాయికగా నటించగా కంచరపాలెం ఫేమ్ కార్తీక్ రత్నం ఈ సినిమాలో ముఖ్య పాత్ర చేస్తున్నాడు. రెండు కులాల మధ్య జరిగే పోరాటం ఈ సినిమా నడుస్తుందని తెలుస్తుంది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదలవుతున్న నేపథ్యంలో వెంకీ ఫ్యాన్స్ ఒకింత నిరాశ గా ఉన్నా తమ హీరోను కొత్త సినిమాలో చాలా రోజుల తర్వాత చూడబోతున్నాం అనే ఆనందం మాత్రం వారిలో నెలకొంది.
ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ పనుల్లో వెంకటేశ్ చురుగ్గా పాల్గొంటున్నాడు. వెంకటేష్ తో పాటు సురేష్ బాబు కూడా కొన్ని ఇంటర్వ్యూలు ఇస్తూ ఈ సినిమా గురించిన విశేషాలు చెబుతున్నాడు. తాజాగా వెంకటేష్ తన సినిమాల నిర్ణయంలో సురేష్ బాబు పాత్ర తప్పకుండా ఉంటుంది అని కొన్ని కామెంట్స్ చేయగా నెటిజన్లు సోషల్ మీడియాలో వెంకటేష్ ఒంటరిగా సినిమాల నిర్ణయాలు తీసుకోలేరా అన్న కామెంట్స్ పెడుతున్నారు. మొదటి నుంచి గమనిస్తే దగ్గుబాటి కాంపౌండ్ లోకి ఎంటరైన ప్రతి దర్శకుడు సురేష్ బాబు ను మొదట ఒప్పించిన తర్వాతనే వెంకటేష్ కానీ రానా కి కానీ సినిమా కథలు చెప్పాలి. సురేష్ బాబు గా నచ్చితేనే ఆ సినిమా పట్టాలెక్కుతుంది అని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతుంటాయి.