
నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ నట వారసుడిగా తెలుగు తెర మీద ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను చేసి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమాతో హిట్ కొట్టి మళ్లీ ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు. గత కొన్ని సినిమాలుగా బాలకృష్ణ తన సినిమాలతో ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయాడు. దాంతో అఖండ సినిమాతో మళ్లీ కం బ్యాక్ చేసి సీనియర్ హీరోలతో పోటీ పడాలని భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే తనకు సింహా, లెజెండ్ లాంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన బోయపాటి శ్రీను తో చేస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తుందని ఆయన ఆశిస్తున్నారు.
ఇదిలా ఉంటే బాలకృష్ణ కెరీర్లో ఎప్పటికీ మర్చిపోలేని క్లాసిక్ గా మిగిలిపోయే సినిమా ఆదిత్య369. ఆయన కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ సినిమా అయిన ఈ సినిమా టాలీవుడ్ చరిత్రను తిరగ రాసింది. ఇండియాలోనే మొదటి సైన్స్ ఫిక్షన్ సినిమా గా ఈ చిత్రం ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది. గడియారం గిర్రున వెనక్కి తిరిగితే ప్లాష్ బ్యాక్ లోకి వెళ్లి రావచ్చు.. ముందుకు తిరిగితే ఫ్యూచర్ చూడవచ్చు అనే కాన్సెప్ట్ తో తెలుగు ప్రేక్షకులకు ఫాస్ట్, ఫ్యూచర్ ను చూపించిన సినిమా ఆదిత్య 369.
టైం మిషన్ నేపథ్యంలో అప్పటి వరకు భారతీయ సిల్వర్ స్క్రీన్ పై రానటువంటి కథతో ఈ సినిమా తెరకెక్కింది. క్లాస్ నుండి మాస్ వరకు అందరిని మెప్పించింది. హాలీవుడ్ లో బ్యాక్ టూ ఫ్యూచర్ అనే మూవీ కాన్సెప్ట్ ను మన నేటివిటీకి తగ్గట్లు మార్చి అద్భుతంగా తెరకెక్కించారు. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించగా ఒక మనిషి భవిష్యత్తు, గతం లోకి వెళితే ఎలా ఉంటుంది అన్న కాన్సెప్ట్ ఈ ఆదిత్య369. ఈ సినిమాలో హీరో గతంలో లో కి శ్రీకృష్ణదేవరాయలు కాలంలో కి వెళ్లగా ఆనాటి స్వర్ణయుగం ఏ విధంగా ఉంటుందో అద్భుతంగా తెరకెక్కించారు. భవిష్యత్తులో మూడవ ప్రపంచ యుద్ధం వల్ల ప్రపంచం అంతం కాగా అక్కడ ఏర్పడే పరిస్థితులు కళ్ళకు కట్టినట్లు చూపించారు.