ఒక రంగానికి చెందిన సెలబ్రిటీలు మరొక రంగానికి చెందిన సెలబ్రిటీలను ప్రేమించి పెళ్లి చేసుకోవడం సాధారణంగా జరిగేదే. అయితే ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబందించిన ఒక స్టార్, క్రీడా రంగానికి చెందిన సెలబ్రిటీనీ ప్రేమించడం. పెళ్లి చేసుకోవడం అనేవి పెద్ద విషయాలే. ఇక ఇలాంటి విషయం తెలిసినప్పుడు కుటుంబ సభ్యుల సంగతి ఏమో కానీ, వారి అభిమానుల ఆనందానికి మాత్రం అంతే ఉండదు. ఇప్పటికే పలువురు క్రికెటర్లు ఫిలిం ఇండస్ట్రీకి చెందిన స్టార్స్ ప్రేమలో పడి వారి బంధాన్ని పెళ్లి వరకు తీసుకెళ్లారు. బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ, ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లీ లు కూడా ఈ బాపతే. ఇలా పలువురు ప్రేమలో పడి పెళ్లి చేసుకుని ఒకటయ్యారు.

అయితే ఇప్పుడు తాజాగా టాలీవుడ్ యంగ్ హీరోయిన్ కి ఓ ప్రముఖ క్రికెటర్ లవ్ ప్రపోజ్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. తాజాగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి విజయాన్ని సొంతం చేసుకున్న ఆ భామ ఇపుడు వరుస అవకాశాలతో ఫుల్ బిజీగా ఉంది. అయితే ఆ హీరోయిన్ సినిమా యాడ్ ని చూసి తన అందానికి ఫిదా అయిన ఆ క్రికెటర్ ఆ తర్వాత సినిమా చూశాడట తనకి ఆ హీరోయిన్ తెగ నచ్చడంతో తనే తన సోల్ మేట్ అని ఫిక్స్ అయిపోయి వెంటనే ఆ హీరోయిన్ డీటైల్స్ తెలుసుకుని ఆమెకు విషయాన్ని తెలిపినట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె నిర్ణయం కోసం ఎంతో ఆసక్తిగా ఉన్నాడట.

ఇంతకీ ఆ క్రికెటర్ ఎవరు ? ఏ హీరోయిన్ తో అతను ప్రేమలో పడ్డాడు ? లాంటి పలు విషయాలు తెలియాలంటే వారిద్దరిలో ఎవరో ఒకరు బయట పెడితేనే తెలుస్తుంది. ఇది తెలిసిన నెటిజన్లు, వారిద్దరో ఎవరో తెలియక జుట్టు పీక్కుంటున్నారు. ప్రస్తుతం అందరి ఫోకస్ మాత్రం వీరిద్దరి పైనే ఉంది...మరి కొంతమంది అయితే వారికీ తోచిన పేర్లను అనుకుంటూ ఆనందపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: