యాక్టర్, డైరెక్టర్ శివకుమార్ తనయుడైన సూర్య ‘నెరుక్కునేర్’ చిత్రంతో కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా ఆయనకు అనుకున్నంత పేరు తీసుకురాలేదు. సూర్య నటన పట్ల పలు విమర్శలొచ్చాయి. ఈ క్రమంలో తనలోని నటుడికి మరింత మెరుగులు దిద్దాడు. వరుసగా డిఫరెంట్ రోల్స్ ప్లే చేస్తూ, సినిమా సినిమాకు వ్యత్యాసం చూపిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నాడు. ఈ క్రమంలోనే ఏ.ఆర్.మురుగదాస్ డైరెక్షన్‌లో వచ్చిన ‘గజిని’సినిమాతో తమిళ్‌ ప్రజలతో పాటు తెలుగు వారి మనసు కూడా దోచుకున్నాడు. ఈ రోజు నటుడు సూర్య పుట్టిన రోజు. కాగా, ఈ సందర్భంగా ఆయన నటించిన సినిమాల్లో తెలుగులో విడుదలైన టాప్ ఎనిమిది ఫిల్మ్స్‌పై స్పెషల్ ఫోకస్..

 
తెలుగులో విడుదలైన ‘గజిని’తో టాలీవుడ్‌లోనూ సూర్యకు ఒక మార్కెట్ ఏర్పడింది. సూర్యకు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా వచ్చింది. వెర్సటైల్ యాక్టర్‌గా  ఆడియన్స్‌కు గుర్తుండిపోయాడు. సూర్య సినిమా వచ్చిందంటే చాలు..తప్పక చూసేయాల్సిందే అనేంతలా ఇంప్రెషన్ క్రియేట్ చేశాడు. సూర్య పోలీసు పాత్ర పోషించిన ‘యముడు’ చిత్రం తెలుగు వారికి అత్యంత ఇష్టమైన చిత్రమని చెప్పొచ్చు. 



ఇందులో సూర్యకు జోడీగా స్వీటి అనుష్క నటించగా, దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అలరిస్తుంది. పోలీసు పాత్రకు కంటిన్యూటి జోడిస్తూ వచ్చిన ‘సింగం’ కూడా బాక్సాఫీసు వద్ద సూపర్ సక్సెస్ అయింది. కే.వీ.ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన ‘బ్రదర్స్, బందోబస్త్’ సినిమాలు, ‘గ్యాంగ్’ చిత్రాలు సూర్యకు తెలుగులో మంచి పేరును తీసుకొచ్చాయి.



 ‘బందోబస్త్’ చిత్రంలో మాలీవుడ్ కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ కీలక పాత్ర పోషించారు. ఇటీవల ఆయన నటించిన ‘సురైరాపోట్రు’ చిత్రం తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ అనే పేరుతో విడుదల కాగా, ఓటీటీలో మంచి ఆదరణ లభించింది. సుధా కొంగర దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎయిర్ డెక్కన్ ఫౌండర్ జి.ఆర్.గోపినాథ్ బయోపిక్. ఈ సినిమాకు ఓటీటీ లవర్స్, సినీ ప్రియులు, విమర్శకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: