టాలీవుడ్ లో ఉన్న డైరక్టర్స్ లో మినిమం డైరక్టర్ గా పేరు తెచ్చుకున్నారు మారుతి. తక్కువ టైం.. లిమిటెడ్ బడ్జెట్.. కాని సినిమా క్వాలిటీ విషయంలో మాత్రం అదిరిపోతుంది ఇది మారుతి ఫార్ములా. కెరియర్ మొదట్లో కొద్దిగా అడల్ట్ డోస్ ఎక్కువ ఉన్న సినిమాలు చేసిన మారుతి భలే భలే మగాడివోయ్ సినిమా నుండి పూర్తిగా తన పంథా మార్చాడు. ఇప్పుడు మారుతి సినిమా అంటే ఫ్యామిలీ మొత్తం చూసి ఎంజాయ్ చేసే సినిమాగా ఉంటున్నాయి.

సాయి ధరం తేజ్ తో ప్రతిరోజూ పండుగే సినిమాతో హిట్ అందుకున్న మారుతి ఆ తర్వాత రెండు సినిమాలతో వస్తున్నాడు. అందులో ఒకటి గోపీచంద్ తో చేస్తున్న పక్కా కమర్షియల్ కాగా.. మరోటి సంతోష్ శోభన్ హీరోగా వస్తున్న మంచి రోజులు వచ్చాయ్. ఈ సినిమాకు సంబందించిన క్యారక్టర్ ఇంట్రో టీజర్ ఒకటి రిలీజ్ చేశారు. ఈ టీజర్ చూస్తేనే సినిమా పక్కా హిట్ అనిపిస్తుంది. మారుతి మార్క్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా టీజర్ తోనే సినిమాపై అంచనాలు పెంచేసింది. ఈ సినిమాలో సంతోష్ శోభన్ కు జోడీగా మెహ్రీన్ కౌర్ హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాకు అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇంట్రో టీజర్ కు ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది.

క్యారక్టర్ ఇంట్రో టీజర్ తో కథలో క్లారిటీ ఇవ్వకపోయినా సినిమా మాత్రం ఆద్యంతం కామెడీతో అలరిస్తుందని మాత్రం అర్ధమవుతుంది. ఫ్యామిలీ మొత్తం చూసి హాయిగా నవ్వుకునే సినిమాతో వస్తున్నాడు మారుతి. ఈమధ్యనే ఏక్ మిని కథతో హిట్ అందుకున్న సంతోష్ శోభన్ మంచి రోజులు వచ్చాయ్ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకునేలా ఉన్నాడు. సినిమా టీజర్ అదుర్స్ అనిపించగా సినిమా కూడా ఇలానే ఉంటే పక్కా హిట్ అనేస్తున్నారు ఆడియెన్స్.





మరింత సమాచారం తెలుసుకోండి: