ప్రపంచంలోని అగ్రగామి ఓటీటీ సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ పరిస్థితి ఇండియాలో ముఖ్యంగా టాలీవుడ్ లో కొంత దయనీయంగా ఉందని చెప్పవచ్చు. ఇప్పటివరకూ ఇందులో విడుదలైన సినిమా ఏది కూడా అంతగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఒక్క మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా తప్ప మిగతా సినిమాలన్నీ అమెజాన్ ప్రైమ్ లో తేలిపోయాయి అని చెప్పొచ్చు. అయితే ఇటీవలే అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన డియర్ కామ్రేడ్ సినిమా మాత్రం అమెజాన్ ప్రైమ్ ను ఉరకలెత్తిస్తుంది.

వెంకటేష్ హీరోగా నటించిన నారప్ప సినిమా తమిళంలో ధనుష్ హీరోగా నటించిన అసురన్ సినిమాకి తెలుగు రీమేక్ కాగా ఈ సినిమా భారీ వివెర్ షిప్ తో తెలుగునాట సంచలనం సృష్టిస్తోంది. అమెజాన్ ప్రైమ్ లో తొలి బ్లాక్ బస్టర్ హిట్ గా ఈ చిత్రాన్ని అభివర్ణిస్తున్నారు మన ప్రేక్షకులు. కుల వివక్షత అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా విడుదలైన రోజు నుంచి సాలిడ్ వివర్ షిప్ అందుకుంటూ ప్రేక్షకులకు అమెజాన్ ప్రైమ్ ను మరింత దగ్గర అయ్యే విధంగా దూసుకుపోతుంది.

ఇటీవలే అమెజాన్ ప్రైమ్ భారీ రేటు తో హిందీలో క్రేజీ చిత్రంగా 85 కోట్ల రేటు పెట్టి తుఫాన్ అనే సినిమాను కొనుగోలు చేశారు. ఫర్హాన్ అక్తర్ హీరోగా రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా పై బాలీవుడ్ ఎన్నో అంచనాలు పెట్టుకోగా అమెజాన్ ప్రైమ్ కూడా దీని ద్వారా తమకు భారీ లాభాలు చేకూరుతాయి అని భావించింది. కానీ 85 కోట్ల రూపాయల డబ్బు కు ఏ మాత్రం న్యాయం చేయని విధంగా తుఫాన్ సినిమా డల్ గా నిలిచింది. కానీ నలభై కోట్ల రేటుతో కొనుగోలు చేసిన నారప్పా మాత్రం అంతకుమించిన వివర్ షిప్ తో దూసుకుపోతూ దుమ్ము లేపుతుంది. దాంతో టాలీవుడ్ లో కూడా అమెజాన్ ప్రైమ్ ఫామ్ లోకి వచ్చినట్లు అయింది. జూలై నెలలో విడుదలైన సినిమాలలో నారప్ప సినిమా టాప్ ప్లేస్ లో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: