తెలుగు సినిమా చరిత్రలో ఎన్నో గొప్ప గొప్ప చిత్రాలను కృష్ణవంశీ తెరకెక్కించాడు. కుటుంబ కథా చిత్రాలైనా, దేశభక్తి చిత్రాలైన, యాక్షన్ సినిమాలైనా కృష్ణవంశీ తర్వాతే ఎవరైనా. తొలి సినిమా గులాబి తోనే తన దర్శకత్వ పరిమళాన్ని అందరికీ వాసన చూపించాడు. ఆ సినిమా సూపర్ హిట్ కాగా రెండవ చిత్రం నిన్నే పెళ్ళాడుతా ఆయనకు నేషనల్ అవార్డును తెచ్చిపెట్టింది. బెస్ట్ డైరెక్టర్ గా అవార్డు అందుకున్న ఆయన నుంచి మూడవ చిత్రం సింధూరం కూడా మరో నేషనల్ అవార్డ్ ను తెచ్చి పెట్టింది.

ఆ తర్వాత ఆయన చంద్రలేఖ, అంతఃపురం, సముద్రం మురారి, ఖడ్గం, చక్రం,చందమామ, మహాత్మా వంటి ఎన్నో గొప్ప చిత్రాలను తెరకెక్కించి టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు. ఆయన కెరీర్ లో తెరకెక్కించిన ఎన్నో గొప్ప గొప్ప సినిమాలలో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన చిత్రం ఖడ్గం. రవితేజ, శ్రీకాంత్, ప్రకాష్ రాజు ముఖ్య పాత్రలు గా తెరకెక్కిన ఈ సినిమా దేశభక్తి చిత్రం కాగా  ప్రేక్షకులను ఎంతో అలరించింది. ఈ ముగ్గురితో పాటు దర్శకుడు కృష్ణవంశీ కి కూడా ఎంతో గొప్ప పేరును తీసుకువచ్చింది ఈ సినిమా. 

హీరోగా అప్పుడప్పుడే ఎదుగుతున్న రవితేజ కు ఆయన కెరీర్ కు ఈ సినిమా ఎంతగానో ఉపయోగ పడింది. నిజానికి ఈ సినిమాకు కృష్ణవంశీ మదిలో రూపుదిద్దుకోవడానికి కారణం ఏమిటో ఈ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఓ సారి హైదరాబాద్ లో పాత బస్తీ కి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని చోట్ల బిన్ లాడెన్ పర్వేజ్ ముషారఫ్ ఫోటోలు చూసి కృష్ణవంశీ కి కోపం వచ్చిందట. దేశ భక్తి గురించి వాళ్లకు అప్పుడు ఎలా చెప్పాలో తెలియలేదట. ఆ తర్వాత ఈ సంఘటన ఖడ్గం సినిమా రూపొందించడానికి కారణం అయింది అని వెల్లడించారు. హిందూ ముస్లింల మధ్య ఉండే సోదరభావాన్ని ఎంతో ఆప్యాయంగా చూపించారు కృష్ణవంశీ. ఇప్పటికీ ఈ సినిమా బుల్లితెరపై వస్తే ప్రేక్షకులు కను రెప్ప వేయకుండా చూస్తూ ఉంటారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: