సూపర్ స్టార్ మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సర్కారు వారి పాట సినిమా జనవరి 13న సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్న విషయం అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి ఎస్.ఎస్ తమన్ సంగీతం సమకూరుస్తుండగా ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా పండుగ సందర్భంగా విడుదల అవుతుండడం వారికి ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. దానికి తోడు మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు వంటి హిట్ సినిమా తర్వాత చేస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.

ప్రస్తుతం మహేష్ బాబు చేయబోయే తదుపరి సినిమాలపై దృష్టి సారించారు ఆయన అభిమానులు. ఒక వర్గం రాజమౌళి తో మహేష్ నెక్స్ట్ సినిమా అని చెబుతుంటే మరొక వర్గం త్రివిక్రమ్ అని చెబుతోంది ఈ రెండింటిలో ఏది నమ్మాలో ఎది నమ్మ వద్దో తెలియక కన్ఫ్యుజ్ అయిపోతున్నారు ప్రేక్షకులు. మరోవైపు పాన్ ఇండియా సినిమాలు చేసుకుంటూ పోతున్న ఇతర హీరోలను చూసైనా మహేష్ బాబు పాన్ ఇండియా సినిమాలు చేస్తాడా అని అభిమానులు ఆశగా పడుతుండగా మీడియా రేంజ్ దర్శకులతో ఆయన సినిమాలు చేయడం వారిని ఎంతగానో నిరాశపరుస్తుంది. 

ఇన్ని అయోమయాల మధ్య మహేష్ బాబు నెక్స్ట్ సినిమా అనౌన్స్మెంట్ ముడిపడి ఉంది. దాదాపుగా త్రివిక్రమ్ తోనే మహేష్ బాబు తదుపరి సినిమా ఓకే అయిపోయిందని చెబుతుండగా ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో కూడా సినిమా ఉంటుందని తెలుస్తుంది. రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమా అక్టోబర్ లో ఫినిష్ చేసి విడుదల చేస్తాడు. ఆ తర్వాత ఖాళీగా ఉంటాడు. మహేష్ బాబు కూడా సర్కారు వారి పాట అప్పటికి సినిమా పూర్తి చేస్తాడు. ఆ తర్వాత రాజమౌళి తో చేతులు కలుపుతాడు అని అంటున్నారు. ఇంకోవైపు త్రివిక్రం స్క్రిప్ట్ కూడా అక్టోబర్ కి పూర్తి చేస్తాడు. ఆ తరువాత మహేష్ తో సెట్స్ పైకి వెళ్తాడు అని అంటున్నారు. ఇంకా కొంతమంది రెండు సినిమాలు ఒకేసారి చేస్తాడు అని అంటున్నారు. మరి ఇందులో ఏది నిజమో అబద్దమో తెలియాలి అంటే మహేష్ నోరు విప్పాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: