మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాను విడుదలకు సిద్ధం చేస్తూనే తను నటిస్తున్న మరో మూడు సినిమాలకు సంబంధించిన పనులను చూసుకుంటున్నాడు. మోహన్ రాజా దర్శకత్వంలో లూసిఫర్ రీమేక్ చేస్తున్న చిరంజీవి అదే సమయంలో మెహర్ రమేష్ తో వేదాళం రీమేక్ సినిమాను చేస్తున్నాడు. ఇంకోవైపు బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రాన్ని పరిశీలిస్తున్నాడు. ఈ మూడు చిత్రాలు చిరంజీవి కెరీర్ లో మరపురాని చిత్రాలుగా నిలుస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇకపోతే తాజాగా బాబీ ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ముఖ్యంగా చిరంజీవి తో చేయబోయే సినిమా గురించి కొన్ని క్లూలు ఇచ్చాడు. ఇది స్టార్ కి అభిమాని కి మధ్య జరిగే కథ అని అన్నారు. మెగాస్టార్ చిరంజీవి కి తగిన ఫ్యాన్ కోసం వెతుకులాట జరుగుతుంది అంటున్నారు. గతంలో ఈ సినిమా లో చిరు ద్విపాత్రాభినయం  అనుకున్నా కూడా ఇప్పుడు యంగ్ హీరోకి ఛాన్స్ ఇవ్వాలని చిరంజీవి చెప్పడంతో ఈ సినిమా టీమ్ మరో హీరో కోసం ఎదురు చూస్తున్నారు. ఈ లైన్ వింటే డ్రైవింగ్ లైసెన్స్ సినిమా గుర్తు రాక మానదు. ఇది  కూడా అలానే స్టార్ హీరోని అభిమానించే ఓ ఆర్ ఢీ ఓ ఆఫీసర్ కథే ఈ సినిమా. 

ఎప్పుడైతే బాబీ ఈ విషయం చెప్పాడో అప్పటి నుంచి సోషల్ మీడియాలో చిరంజీవిపై ట్రోలింగ్ మొదలవుతుంది. అదేమిటంటే ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి వరుస రీమేక్ సినిమాలు చేస్తుంటే ఇప్పుడు మరో రీమేక్ సినిమా చేస్తున్నాడా అని త్రో లింగ్ చేస్తున్నారు. దానికి తోడు గత కొన్ని రోజులుగా ఈ డ్రైవింగ్ లైసెన్స్ అనే మలయాళం సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమా ను తెరకెక్కిస్తున్నట్లూ  ప్రకటించలేదు. మొత్తానికి డ్రైవింగ్ లైసెన్స్ నుంచి బాబీ స్ఫూర్తి పొందారు అని అనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: