
పూర్తి వివరాల్లోకి వెళితే, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 2008 సంవత్సరంలో వచ్చిన సినిమా బుజ్జిగాడు. ఈ చిత్రం ఒక భారీ విజయాన్ని సాధించిందని చెప్పవచ్చు ఇకపోతే కండలవీరుడు ప్రభాస్ ని మనం ఈ సినిమాలో సన్నని లుక్ తో చూడడం గమనించవచ్చు. అయితే ఇటీవల దాదాపు కొన్ని సంవత్సరాల తర్వాత బుజ్జిగాడు సినిమా హీరోయిన్ సంజన గాల్రాణీ, తాజాగా ప్రభాస్ గురించి ఒక సంచలన నిజాలు బయట పెట్టింది.
అదేమిటంటే, ప్రభాస్ కి భోజనం అంటే చాలా ఇష్టం ఆయన భోజనప్రియుడు అని చెప్పవచ్చు. బుజ్జిగాడు సినిమా కోసం అందరూ మంచి మంచి భోజనం చేస్తూ, ఆనందిస్తుండగా , ప్రభాస్ మాత్రం కేవలం పెసరట్టు మాత్రమే నెలరోజుల పాటు తిని జీవించాడు అని ఆమె చెప్పుకొచ్చింది. ఇక అంతే కాదు ప్రభాస్ ఆ సినిమాలో సన్నగా కనిపించడం కోసమే ఇలా చేశాడని తన లో ఉన్న అంకితభావానికి ఎవరైనా ఫిదా అవుతారని ఆమె తెలిపింది..
నిజానికి ప్రభాస్ ఒక రాజ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. అతనికి పెసరట్టు తిని జీవించాల్సిన అవసరం అంతకన్నా లేదు. కాకపోతే అతను అంకితభావంతో పని చేస్తున్నారు. కాబట్టి ప్రస్తుతం స్టార్ హీరోగా ప్రపంచవ్యాప్తంగా తన ఖ్యాతిని సంపాదించుకున్నాడు. తను ఇంకా ఎత్తుకు పోతాడు అని నేను కూడా ఆశిస్తున్నాను అని ఆమె తెలిపింది.