నేషనల్ సెలెబ్రెటీగా మారిన ప్రభాస్ కు లక్షలలో అభిమానులు ఉన్నారు. ‘సాహో’ పరాజయం తరువాత కూడ ప్రభాస్ డేట్స్ ఇస్తే చాలు అంటూ అతడి చుట్టూ తిరుగుతున్న దర్శక నిర్మాతలు అనేకమంది. అయితే అలాంటి నేషనల్ సెలెబ్రెటీని ఇప్పటి వరకు ఒక్క సూపర్ హిట్ కూడ చూడని యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తో పోలిక అంటే ప్రభాస్ అభిమానులు అంగీకరించరు.
అయితే ఇప్పుడు ప్రభాస్ తో బెల్లంకొండను పోలుస్తూ రాజమౌళి కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈమధ్య ‘ఛత్రపతి’ హిందీ రీమేక్ లో నటిస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్ ఈమధ్య తన మూవీ షూటింగ్ ప్రారంభోత్సవానికి అతిధిగా రావలసిందిగా రాజమౌళిని బెల్లంకొండ జక్కన్న ఇంటికి వెళ్ళి కోరాడట.
బెల్లంకొండ ఆహ్వానాన్ని అంగీకరిస్తూ రాజమౌళి బెల్లంకొండను చూసి తనకు అతడిలో మరొక ప్రభాస్ కనిపిస్తున్నాడు అనడమే కాకుండా తాను ప్రభాస్ తో ‘ఛత్రపతి’ మూవీ మొదలుపెట్టినప్పుడు ప్రభాస్ లుక్ ఏవిధంగా ఉందో ఇప్పుడు బెల్లంకొండ లుక్ కూడ అలాగే ఉంది అంటూ ప్రశంసలు కురిపించాడట. ఈ ప్రశంసలు తనకు ఎంతో మానసిక ధైర్యాన్ని కలిగించాయని బెల్లంకొండ శ్రీనివాస్ అంటున్నాడు.
అంతేకాదు ‘చత్రపతి’ హిందీ రీమేక్ ప్రారంభానికి ముందు బెల్లంకొండ ప్రభాస్ ను కూడ కలిసాడట. తన సూపర్ హిట్ మూవీ రీమేక్ లో బెల్లంకొండ నటిస్తున్నందుకు ప్రభాస్ అభినందిస్తూ ఈ మూవీతో బెల్లంకొండ కెరియర్ కు బ్రేక్ వస్తుందని చెపుతూ ఈమూవీవి కథ ఇప్పటికీ అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని బెల్లంకొండను బాలీవుడ్ ప్రేక్షకులు ఆదరిస్తారు అన్న నమ్మకం తనకు ఉంది అంటూ ప్రభాస్ బెల్లంకొండను ప్రోత్సహించాడు అంటూ వాస్తున్న వార్తలు హాట్ న్యూస్ గా మారింది. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్న వివి వినాయక్ ఈమూవీ స్క్రిప్ట్ లో ఇప్పటి తరం ప్రేక్షకులకు నచ్చే విధంగా అనేక మార్పులు చేసాడు అన్న వార్తలు ఇండస్ట్రీలో గుప్పుమంటున్నాయి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి