సినిమాలూ జీవితాలూ వేర్వేరుగా
ఉంటాయని ఊహా సౌధాల నిర్మాణం
రంగుల మానియాతోనే సాధ్యం అని
ఒక ఫార్ములా నడిచేది
జీవితం నుంచి వడకట్టినవి
సినిమాలు ఇస్తాయని
కథ అంటే కాకమ్మ కబుర్ల
కలబోత కాదని
తేల్చింది మరో ఫార్ములా
తాజాగా దేశం మెచ్చిన
ప్రపంచమే నివ్వెర పోయిన
కథ ఒకటి కుర్రాళ్లకు నచ్చేలా
వస్తుంది ...
ఆ కుర్రాడు నీరజ్ చోప్రా
ఒక విజేత ఆత్మ కథ
టోక్యో ఒలంపిక్స్ తరువాత ఇండియాకు చేరుకున్న ఆ కుర్రాడిని దేశ రాజధాని నెత్తిన పెట్టుకుంది.తన మాటలు వింటూ వింటూ మురిసిపోతోంది.తనకు తోచిన మాటలు చెబుతుంటే ఇంకేం మీరూ వినాల్సిందే అని యువతకు ఓ దారి దొరికిందన్న సంతోషంలోక్రీడాశాఖ మంత్రి ఉన్నారు.ప్రధాని మోడీ ఉన్నారు.తనను తాను జయించిన తీరులో భయమూ,ఉద్వేగమూ ఎలా ఉన్నాయో ..చెబుతూ పోతున్నాడు. ఈ కథ రాస్కోండి..బయోపిక్ అవు తుంది..ఈ కథ వింటే మీకు కొత్త ఉత్సాహం తెలియకుండానే పలకరిం చి పోతోంది.
ఆ దారికి పొండి
కథలే కథలు
హరియాణా దారులకు పోయి ఆమీర్ దంగల్ సినిమా తీశాడు.భాగ్ మిల్కా భాగ్ అని మన జావేద్ అక్తర్ గారి అబ్బాయి నట,గా యకుడు ఫర్హాన్ అక్తర్ మరో సి నిమా తీశాడు.మేరీకోమ్ ను తనలో నింపుకుని పోయింది ప్రి యాంక..ఈ విధంగా అంతా సినిమా లు తీసి తమ తమ జీవితాలను కొత్త కొత్త అర్థాలతో నింపేస్తుంటే మరి నా కథకు మీరు ఎప్పుడు ప్రాణం ఇస్తారు అని అడిగేడు ఓ సందర్భంలో నీరజ్..
నయా ఫార్మెట్
నో ఫార్ములా నో మసాలా
హరియాణాలో ఒకటి కాదు రెండు కథలున్నాయి కదా! ఒకటి రవి దహియా ది రెజ్లర్.. ఇంకొకటి మనోడిది..ఇంకో కథ కూడా ఉం దండి వినేశ్ ఫోగట్ ది.. ఆమె విజయం సాధించి ఉంటే మూడు కథలతో మూడు సినిమాలు వ చ్చేవి..ముచ్చటగా ఈ మూడు కథ లూ దేశం వినేది మరోసారి..ఆమీర్ లాంటి వారికి ఓ పండుగ కావొచ్చు.తన కథకు మాత్రం అక్షయ్ సరిపోతాడన్నది నీరజ్ భావన.మరో నటుడు కూడా ఆయనకు ఇష్టమే..అక్షయ్ లానే అ వకాశాల కోసం స్టూడియోల చుట్టూ తిరిగిన మరో చిన్నోడు రణ్ దీప్..స్టైలింగ్ లో ఆయనను ఈయన అనుకరిస్తాడో..ఈయను ఆయన అనుకరిస్తాడో కానీ నీరజ్ కథకు త్వరలో ఓ ఫిల్మ్ ఫార్మెట్ మాత్రం దక్కనుంది.ఇక మా ఊరి అమ్మాయి,శ్రీకాకుళం ఫేం కరణం మల్లేశ్వరి కథనూ,ఇంకా ఇంకొందరి కథలనూ తెరపైకి తెచ్చే పనికి బ యో పిక్ రూపకర్తలు తాపత్రయపడుతున్నారు అన్నది ఎప్పటి నుంచో నిర్థారణలో ఉన్న సమాచారం.దానికో కొన సాగింపు ఇది. ఇక నీరజ్ కూడా హీరోగా ఎంట్రీ ఇస్తాడేంటో! అదికూడా ఆయన కల కావొచ్చు..అవుతుందో లేదో అన్నదే ఆసక్తిదాయక పరిణామం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి