ఎన్టీఆర్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రస్తుతం విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉంది ఈ చిత్ర బృందం. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు కాగా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తుంది. మరోవైపు కొరటాల శివ కూడా తన ఆచార్య సినిమా ను విడుదలకు సిద్ధంగా ఉంచాడు.

ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ తో ఆయన రెండో సినిమా చేయడం టాలీవుడ్ లో ఎంతో క్రేజ్ ను నెలకొని ఉంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో జనతా గ్యారేజ్ సినిమా రాగా ఇప్పుడు ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. వరుస పాన్ ఇండియా చిత్రాలతో టాలీవుడ్ హీరోలు దూసుకుపోతున్న క్రమంలో ఎన్టీఆర్ కూడా ఆ తరహాలోనే సినిమా లను తెరకెక్కించబోతున్నాడు. ఇక ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కే బోయే మరొక పాన్ ఇండియా చిత్రం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. కే జి ఎఫ్, సలార్ సినిమాతో దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ను వేరే లెవెల్ లో చూపించబోతున్నాడట. 

ఇకపోతే తన కెరీర్ ను పాన్ ఇండియా లెవెల్ లో సెట్ చేసుకున్న ఎన్టీఆర్ తో కృష్ణవంశీ సినిమా చేయాలని చూస్తున్నాడట. ఇప్పటికే ఆయన దగ్గర ఉన్న ఓ కథను ఎన్టీఆర్ కు వినిపించాడట. టాలీవుడ్ వర్గాల నుంచి వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ కథ గతంలో ఆయన బాలకృష్ణతో చేయాలనుకున్న కథ అని తెలుస్తుంది. బాలకృష్ణతో రైతు అనే సినిమాను కృష్ణవంశీ చేయాలని చూడగా అది క్యాన్సల్ అయింది. దాంతో ఆ సినిమా కథలో కొన్ని మార్పులు చేసి ఎన్టీఆర్ ఇమేజ్ కు తగ్గట్టుగా మార్చి ఎన్టీఆర్ కు కథ చెప్పాడట. మరి ఈ సినిమా ఎంతవరకు ఓకే ఆవుతుందో చూద్దాం. 

మరింత సమాచారం తెలుసుకోండి: