
ప్రస్తుతం టాలీవుడ్ సినిమా స్థాయి మారిపోయింది. అందరూ హీరోలు పాన్ ఇండియా సినిమాలు అంటూ పాన్ ఇండియా మార్కెట్ లో తమ రేంజ్ పెంచుకునే విధంగా సినిమాలను చేస్తున్నారు. భారీ బడ్జెట్ చిత్రాలు చేస్తూ అన్ని భాషల హీరోల సినిమాలకు సవాళ్లు విసురుతున్నారు. టాలీవుడ్ లో మాత్రమే కాదు అన్ని భాషల హీరోలు ఈ విధంగానే ఆలోచించడం మొదలుపెట్టారు. బాహుబలి సినిమా తర్వాత పూర్తిగా పరిస్థితులు మారాయి అనడానికి ఇప్పటి పరిస్థితులు నిదర్శనం.
ఇకపోతే హీరోయిన్ లు కూడా తాము పాన్ ఇండియా హీరోయిన్ లు గా ఎదగాలని అన్ని భాషలలో చిత్రాలు చేస్తూ ప్రేక్షకుల్లో మంచి పాపులారిటీ సంపాదించుకుంటున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ హీరోయిన్ లు కేవలం హిందీ సినిమాలకే పరిమితం కాకుండా సౌత్ పైన కూడా దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ లో చాలా మంది హీరో లు ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్లతో మాత్రమే సినిమాలు చేస్తున్నారు. విజయ్ దేవరకొండ హీరో గా నటిస్తున్న లైగర్ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది.
అంతే కాకుండా రామ్ చరణ్ శంకర్ ల భారీ ప్రాజెక్టు లో కూడా బాలీవుడ్ హీరోయిన్ కియార అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమా లో పూజ హెగ్డే హీరోయిన్ కా గా మరో హీరోయిన్ గా బాలీవు డ్ హీరోయిన్ ను ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నారట. అంతేకకుండా ఎన్టీఆర్ కొరటాల శివ సినిమాలో ఓ బాలీవుడ్ ముద్దుగుమ్మ కే హీరోయిన్ గా అవకాశం దక్కనుందట. మెగాస్టార్ నటిస్తున్న వేదాళం సినిమా రీమేక్ లో కూడా బాలీవుడ్ ముద్దుగుమ్మ నే ఎంపిక చేస్తున్నారట. ఇలా బాలీవుడ్ హీరోయిన్లందరూ ఇప్పుడు సౌత్ సినిమాల పై పడడంతో హీరోలు కూడా వారిని హీరోయిన్లుగా ఎంపిక చేసుకుంటున్నారు.