
బాబా భాస్కర్ స్టేజ్ మీద ఉన్నాడు అంటే చాలు ఇక బుల్లితెర ప్రేక్షకులందరికీ ఎంటర్టైన్మెంట్ పక్క అని అందరూ భావిస్తూ ఉంటారు. ఇప్పటికే పలు బుల్లితెర కార్యక్రమాల్లో గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన భాస్కర్ రచ్చ రచ్చ చేశాడు. ఇక ఇప్పుడు మరో సారి తనదైన శైలిలో ఎంటర్టైన్మెంట్ షురూ చేశాడు. ప్రస్తుతం ఈ టీవీలో ప్రసారం అవుతున్న రెచ్చిపోదాం బ్రదర్ అనే కార్యక్రమంలో స్పెషల్ గెస్ట్ గా వస్తున్నాడు బాబా భాస్కర్ మాస్టర్. మొన్నటివరకు రాజీవ్ కనకాల ఉన్న జడ్జి ప్లేస్ లో బాబా భాస్కర్ దర్శనమిస్తున్నాడు. ఇక జడ్జి ప్లేస్ లో ఉన్నప్పటికీ బాబా భాస్కర్ అటు కమెడియన్స్ ని సైతం ఒక ఆట ఆడుకుంటున్నాడు అని చెప్పాలి.
ఇటీవలే చచ్చిపోదాం బ్రదర్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియా లో విడుదలైంది. ఈ ప్రోమో కాస్త నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది. అంతేకాదు ఈ ప్రోమో చూసిన ప్రతి ఒక్కరూ పగలబడి నవ్వుకుంటారు. అరె ప్రసాద్ రాసుకోరా.. అంటూ మొదలు పెట్టిన బాబా భాస్కర్ మాస్టర్ స్టేజ్ ఫై కమెడియన్స్ స్కిట్ చేస్తున్న సమయంలో పంచులు వర్షం కురిపిస్తూ రచ్చ రచ్చ చేస్తున్నాడు. దీంతో ఇక స్ట్రీట్ చేస్తున్న కమెడియన్స్ సైతం అవాక్కవుతున్న పరిస్థితి ఏర్పడింది. మరీ ఇంకెందుకు ఆలస్యం ఈ ప్రోమో చూసి మీరు పగలబడి నవ్వండి.