మన సెలబ్రెటీలు ఆరోగ్యం పై ఎంత శ్రద్ధ చూపిస్తారో మనకు తెలిసిందే, ఎక్కడైనా ఏదైనా ఆరోగ్యానికి మేలు చేసే ప్రోడక్ట్ వచ్చింది అంటే వెంటనే దానిని వాడటం మొదలు పెడుతూ ఉంటారు. ఇలా ప్రస్తుతం చాలా మంది సెలబ్రెటీలు ఒక వాటర్ ను తాగుతున్నారు అదే బ్లాక్ వాటర్.. బ్లాక్ వాటర్ ఏంటి..మాకు మినరల్ వాటర్ తెలుసు , జనరల్ వాటర్ తెలుసు ఈ బ్లాక్ వాటర్ ఏంటి అనుకుంటున్నారా..? ఇది కూడా వాటరే కాకపోతే ఔషధగుణాలు చాలా ఎక్కువ మోతాదులో ఉండే వాటర్. ఇప్పటికే ఈ వాటర్ కు ఇండియన్ సెలబ్రిటీస్ అయిన విరాట్ కోహ్లీ , శృతి హాసన్ బానిసలయ్యారు. తాజాగా ఈ లిస్టు లోకి బాలీవుడ్ బ్యూటీ మలైకా ఆరోరా కూడా చేరిపోయింది. ఇలా ఇంత మంది సెలబ్రిటీలు దీనిని అలవాటు చేసుకోవడంతో సోషల్ మీడియాలో ఈ బ్లాక్ వాటర్ గురించి పెద్ద చర్చ నడుస్తుంది. ఈ బ్లాక్ వాటర్ ధర ఎంత ఉంటుంది. .?   దీనిని తాగితే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి..?   అనే విషయాల గురించి అనేకమంది చర్చించుకుంటున్నారు.

అయితే మనం సాధారణంగా తాగే మినరల్ వాటర్ లీటర్ ధర 20 నుండి 30 రూపాయల వరకు ఉంటుంది. అయితే ఈ బ్లాక్ వాటర్ ధర మాత్రం దీనికి మూడింతల రేటు వరకు పలుకుతుంది అంటే దాదాపు వంద రూపాయల వరకు అన్నట్లు. ఈ బ్లాక్ వాటర్ లో చాలా ఔషధ గుణాలు దాగి ఉన్నాయట.. ఒక లీటర్ బ్లాక్ వాటర్ లో  70 మినరల్స్ ఉంటాయి. ఈ వాటర్ జీర్ణ శక్తిని పెంపొందిస్తాయి. ఈ వాటర్ రోజు తాగడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. అలాగే అసిడిటీ ప్రాబ్లం రాకుండా చేస్తుంది. దానితో పాటే మెటబాలిజం పెంపొందిస్తుంది. ఇలా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కాబట్టే సెలబ్రిటీలు ఈ వాటర్ తాగడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: