దీనికితోడు ఒకేసారి మూడు భారీ సినిమాలు ఒకదాని పై ఒకటి పోటీగా విడుదలైతే ఈమూడు మూవీలకు హిట్ టాక్ వచ్చినప్పటికీ ఏమూవీకి పూర్తిగా కలిసిరాదు అన్నఅభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య 2022 సంక్రాంతి రేసులో నాగార్జున లేటెస్ట్ గా మొదలుపెట్టిన ‘బంగార్రాజు’ మూవీ కూడ ఉండబోతోంది అని వస్తున్న వార్తలు ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి.
‘సోగ్గాడే చిన్నినాయన’ మూవీకి సీక్వెల్ గా ఈమూవీ తీస్తున్నారు. నాగార్జున నాగచైతన్య కీర్తి శెట్టి నటిస్తున్న ఈమూవీ కథ బాగా రావడంతో ఈమూవీ ఘన విజయం సాధిస్తుందని నాగార్జున నమ్మకం పెట్టుకుని ఉన్నాడు. కళ్యాణ్ కృష్ణ తయారు చేసిన ఈమూవీ స్క్రిప్ట్ నాగార్జునకు బాగా నచ్చడంతో ఈమూవీని అతివేగంగా ఒకవైపు ‘బిగ్ బాస్’ షో చేస్తూనే నాగార్జున పూర్తి చేస్తాడు అని వార్తలు వినిపిస్తున్నాయి.
తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీ రైట్స్ ను 47 కోట్ల రూపాయలకు జీ టివి పొందినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఆ ఎగ్రిమెంట్ ప్రకారం ఈమూవీని ఎట్టి పరిస్థితులలోను రాబోయే సంక్రాంతికి విడుదల చేస్తానని అంతేకాకుండా ఆ సినిమా పంపిణి బాధ్యత కూడ తనదే అంటూ నాగ్ ఆఎగ్రిమెంట్ లో అంగీకరించాడు అంటూ ఇండస్ట్రీ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కార్పోరేట్ కంపెనీలతో చేసుకునే ఒప్పందాలలో ఏదైనా తేడా జరిగితే భారీ స్థాయిలో పెనాల్టీలు ఉంటాయి. దీనితో వచ్చే సంక్రాంతికి మూడు భారీ సినిమాలు విడుదల అవుతున్న పరిస్థితులలో ఏ దైర్యంతో నాగార్జున ఇటువంటి ఎగ్రిమెంట్ లో ఇచ్చి ఉంటాడు అంటూ ఇండస్ట్రీ వర్గాలలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి