టాలీవుడ్ సినిమా పరిశ్రమలో కొంత మంది హీరోయిన్ లు లేట్ అయినా సరే హీరోయిన్ గా నిలదొక్కుకొని ఆ తర్వాత ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. వారు సినిమా పరిశ్రమకు వచ్చి చాలా రోజులే అయినా కూడా సరైన సినిమా పడక అలా వెనకబడి పోతారు. కానీ సరైన సినిమా పడితే తాము ఏ రేంజ్ లో నటిస్తారా చూపిస్తారు. ఒక హిట్ వారి జీవితాన్ని పూర్తి గా మార్చేస్తుంది. ఆ విధంగా తమిళనాట స్టార్ హీరోయిన్ గా ఉన్నా ఐశ్వర్య రాజేష్ తెలుగులో మాత్రం పెద్ద హీరోయిన్ అవ్వలేకపోయింది.

 రాజేంద్ర ప్రసాద్ నటించిన రాంబంటు చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి సినిమా రంగంలోకి ప్రవేశించిన ఈమె ఆ తరువాత తమిళంలో బాలనటిగా ఎన్నో సినిమాలలో నటించి అక్కడ మంచి గుర్తింపు దక్కించుకుంది. హీరోయిన్ గా కూడా తన ప్రస్థానం మొదలు పెట్టింది కోలీవుడ్ లోనే. తెలుగులో కౌసల్య కృష్ణమూర్తి అనే ఉమెన్ ఓరియెంటెడ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఒక్కసారిగా ప్రేక్షకులందరినీ తన వైపుకు తిప్పుకుంది. ఆ సినిమా ఈమెకు ఇచ్చిన కాన్ఫిడెంట్ అంతా ఇంతా కాదు.

ఆ తర్వాత కొన్ని తెలుగు సినిమాలు చేసినా కూడా ఆమెకు పెద్దగా వర్క్ అవుట్ అవ్వలేదు. దాంతో ఆమె సరైన హిట్ కోసం ఎదురు చూడాల్సి వచ్చింది. విజయ్ దేవరకొండ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో సువర్ణ పాత్రలో మెరవగా అది ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. తాజాగా సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా తనకు మంచి పేరు తీసుకు వస్తుందని ఆమె భావిస్తుంది. దానికి తగ్గట్లు గా ఈ సినిమా తర్వాత ఆమెకు వరుస తెలుగు సినిమా అవకాశాలు రావడం మొదలయ్యాయి. నాని నటించిన జగదీష్ సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్న ఆమె పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీం లా నాయక్ సినిమాలో కూడా ఆమె హీరోయిన్ గా నటిస్తుంది. అంతేకాకుండా కొన్ని తమిళ చిత్రాల్లో కూడా ఈమె హీరోయిన్ గా నటిస్తుంది. నటిగా తానేంటో ప్రూవ్ చేసుకున్న ఐశ్వర్య ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకెలుతుండడం విశేషం. 

మరింత సమాచారం తెలుసుకోండి: