కొన్ని సంవత్సరాల పాటు సినిమాలకు దూరంగా ఉన్న శృతి ‘క్రాక్’ సినిమాతో ట్రాక్ లోకి వచ్చి ఆతరువాత ‘వకీల్ సాబ్’ లో నటించింది. ప్రస్తుతం ప్రభాస్ ‘సలార్’ మూవీలో నటిస్తూ తాను విజయ్ సేతుపతి తో కలిసి నటించిన ‘లాభం’ మూవీ ఫలితం గురించి ఎదురు చూస్తోంది. ‘సలార్’ మూవీ కోసం యాక్షన్ సీన్స్ లో నటించడానికి వియత్నాం నుండి ట్రైనర్ ను పిలిపించుకుని ‘సలార్’ యాక్షన్ సన్నివేశాల కోసం తెగ కష్టపడుతోంది. లేటెస్ట్ గా శృతి హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ ను షేక్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
శృతిహాసన్ వేసుకున్న నేవీ బ్లూ డెనిమ్స్ లో దుమారం రేపింది. ఎయిర్ పోర్ట్ లో కళ్లన్నీ ఈ బ్యూటీ పైనే వాలిపోయాయంటే ఆ లుక్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అలా హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఆమె దిగగానే ఎయిర్ పోర్ట్ లోని జనం అంతా ఆమె డ్రెస్ ను చూసి ముచ్చటపడి ఆమె లుక్ ను తమ సెల్ ఫోన్స్ లో ఫోటోల రూపంలో బద్రపరుచుకున్నారు. ఇప్పుడు ఆఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
వాస్తవానికి హాట్ ఫోటో షూట్స్ విషయంలో శృతి ఎలాంటి మొహమాటం పడదు. అదేవిధంగా జీవితానికి పెళ్ళి ఒక్కటే పరమావధి కాదు అంటూ గతంలో ఆమె చేసిన కామెంట్స్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. తన తండ్రి కమలహాసన్ కు వివాహ వ్యవస్థ పై ఎలా నమ్మకం లేదో ఈమెకు కూడ అలాంటి అభిప్రాయలు ఉన్నాయి. ప్రస్తుత తరం చాలమంది ఆమె అభిమానులుగా సోషల్ మీడియాలో కొనసాగుతున్న విషయం తెలిసిందే..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి