నిజానికి ఒక సినిమా ఫ్లాప్ అయితే దాని తాలూకా క్రెడిట్ హీరో దర్శకుడికి ఇద్దరికీ వెళుతుంది. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం మెగాభిమానులు బోయపాటి శ్రీను దే మొత్తం తప్పు అన్నట్లు గా వ్యవహరించారు. ఆ సినిమా వల్ల ప్రేక్షకులలో కూడా బాగా బ్యాడ్ అయిపోయారు. ఈ నేపథ్యంలో ఆయన మరొకసారి తనను తాను నిరూపించుకునే పనిలో పడ్డాడు. ఈ క్రమంలోనే తాను పెద్ద హిట్ సినిమాలను అందించిన హీరో బాలకృష్ణ తో సినిమా చేస్తున్నాడు. ఇది తనకు హిట్ ఇవ్వడం మాత్రమే కాకుండా పోయిన పేరు కూడా తీసుకు వస్తుందని భావిస్తున్నారు.
ఇక ఆయన ఈ సినిమా తర్వాత బోయపాటి అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్నాడు అని అప్పట్లో ప్రచారం జరగగా బోయపాటి శీను ఉన్న పరిస్థితి చూసి అప్పుడు అల్లు అర్జున్ తన సినిమా రిజెక్ట్ చేశాడని వార్తలు వచ్చాయి. ఆ సినిమా చేయాలంటే ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అఖండ సినిమా ఏమాత్రం అటూ ఇటూ అయినా బోయపాటి శ్రీను కెరీర్ ప్రమాదంలో పడే ప్రమాదం ఉంది. అఖండ బాగుంటే ఓకే లేదంటే మరో హీరో తో హిట్ సినిమా చేయాలి. అలా చేస్తే బోయపాటి శ్రీను ఇన్నాళ్లు పడ్డ కష్టమంతా వచ్చిన స్టార్డమ్ అంతా వృధా అయిపోయిందని చెప్పవచ్చు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి