తెలుగు చలన చిత్ర రంగానికి రీమేక్ కొత్తేమీకాదు. చాలా సార్లు ఈ చిత్రాలే సినీ పరిశ్రమను నిలబెట్టిన సందర్భాలు ఉన్నాయి. చెప్పుకుంటానిని చాలా చిత్రాలు ఈ వరసలో ఉంటాయి. అయితే అక్కడక్కడా కొన్ని అపశృతులు కూడా లేకపోలేదు. ఒక్క సారి రీమేక్ విజయం సాధిస్తే అది మరో భాషలో వస్తూనే ఉంటుంది. అలా ఒక భాషలో విజయం సాధించిన చిత్రాలను ఏరికోరి టాలీవుడ్ లో మళ్ళీ నిర్మించిన నిర్మాతలు చాలా మంది ఉన్నారు.

ఆ వరుసలోనే దర్శకులు కూడా తమ మనసుకు నచ్చిన చిత్రాలను తమ పంధాలో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేసి, విజయం సాధించారు. ఇక్కడ దర్శకుడు ఆయా చిత్రాలను తన పరిశ్రమకు తగ్గట్టుగా ఎలా మార్పులు చేర్పులు చేశాడు అనేదానిపై విజయ అవకాశాలు ఉంటాయి. ఇక్కడి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా ఆయా చిత్రాలను నిర్మించి వెండితెరకు పరిచయం చేయాల్సి ఉంటుంది. అలా చేయడంలో కాస్త అటుఇటు అయి, కొన్ని చిత్రాలు విజయం సాధించలేకపోయాయి తప్ప రీమేక్ ఎప్పుడూ విజయం సాధిస్తూనే ఉంది.

ఇక స్టార్ నటుల నుండి యువకుల వరకు ఈ రీమేక్ లు చేసిన వారే. ముఖ్యంగా ప్రయోగాలకు ముందుండే వారికి ఈ రీమేక్స్ అంటే ఇష్టపడతారు. అలా తయారైందే చిరంజీవి నటించిన ఖైదీ నెం.786. సాదరంగా ఒక స్థాయి కి వచ్చిన నటుడు తనను తక్కువగా చేసి చూపించే పాత్రలు చేయడం అరుదు. కానీ ప్రయోగాలకు సిద్దమైన వాళ్ళు మాత్రం వెనకడుగు వేయరు. అలా ఖైదీ గా కూడా మంచి విజయం ఈ  చిత్రంతో చిరంజీవి అందుకున్నారు.

విజయబాపినీడు దర్శకత్వంలో, మాగంటి రవీంద్రనాధ్ చౌదరి నిర్మాణ సారథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దీనిలో ప్రధాన పాత్రధారులుగా చిరంజీవి, భానుప్రియ, మోహన్ బాబు తదితరులు నటించి మెప్పించారు. అద్భుతమైన సంగీతాన్ని రాజ్ కోటి అందించారు. ఒక సామాన్యుడు తనపై మోపబడిన నేరాన్ని ఎలా నిరూపించుకున్నాడు అనేది చక్కగా చూపించారు దర్శకులు. ఈ పాత్రలో ఇమిడి పోయారు చిరంజీవి. ఇక గడసరి అమ్మాయిగా భానుప్రియ ఎంత చక్కగా చేయగలదో తెలిసిందే, వీరి ఇరువురి మధ్య ప్రేమ యుద్ధం కూడా అంతే బాగా తెరకెక్కించారు దర్శకులు. పాటలు, కొట్లాటలు మద్యమద్యలో సెంటిమెట్స్ అన్నీ కలగలిపి ఈ రీమేక్ ను చక్కగా తీర్చిదిద్దారు, విజయాన్ని సాధించారు. ఇది తమిళ సినిమా అమ్మన్ కోవిల్ కిజకలే రీమేక్.

మరింత సమాచారం తెలుసుకోండి: