కానీ ఎవరి సపోర్ట్ లేకుండా టాలీవుడ్ లో దూసుకుపోతున్న యంగ్ హీరోలు కూడా ఉన్నారని తెలుస్తుంది. ఎవరి అండదండ లేకుండానే సినిమా పరిశ్రమకి వచ్చి ఎన్నో ఇబ్బందులు పడ్డారట.అవకాశాల కోసం తిరుగుతూ ఎన్నో అవమానాలు ఎదుర్కొని మెల్లమెల్లగా హీరోలుగా మారి విజయాలు అందుకున్నారట విజయ్ దేవరకొండ మరియు నవీన్ పోలిశెట్టి
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే సినిమాల గోల్డ్ ఫేస్ లో ఉండేవాళ్ళలా కనిపించినా వీరిద్దరికి ఎన్నో కృష్ణానగర్ కష్టాలు ఉన్నాయని తెలుస్తుంది. నిజానికి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో వీరిని చూసినప్పుడు మనం అస్సలు గుర్తుపట్టం కూడా. కానీ ఇప్పుడు ఈ హీరోలు ఎంత ఫేమస్ అయ్యారో మన అందరికి తెలిసిందే. అయితే, వీరిద్దరిలో విజయ్ దేవరకొండ రేంజ్ మరో లెవల్ లో ఉందని చెప్పొచ్చు.
అర్జున్ రెడ్డి సినిమాతో ఏకంగా స్టార్ హీరో అయిపోయాడు మన విజయ్ దేవరకొండ. ప్రస్తుతం లైగర్ అంటూ పాన్ ఇండియా సినిమా చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఇక నవీన్ విషయానికి వస్తే.. ఇప్పుడు స్టార్ డైరెక్టర్ల చూపు అంతా ఈ యంగ్ హీరో మీదే ఉందని తెలుస్తుంది. నవీన్ నటించిన ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ ఎంతటి వైవిధ్యమైన సినిమానో మన అందరికి తెలిసిందే.
పైగా ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుందని సమాచారం. ఇక ఆ తర్వాత వచ్చిన 'జాతి రత్నాలు' అంటూ నవీన్ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకున్నాడని తెలుస్తుంది.ఆ సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడని సమాచారం. ప్రస్తుతం త్రివిక్రమ్ నిర్మాతగా వస్తోన్న మొదటి సినిమాలో హీరోగా నవీన్ నటిస్తున్నట్లు సమాచారం.
అలాగే కొరటాల శివ నిర్మాణంలో రానున్న సినిమాలో కూడా హీరోగా నవెన్ పోలిశెట్టినే అనుకుంటున్నారని తెలుస్తుంది. నిజానికి ఈ సినిమాలో హీరోగా మొదట విజయ్ దేవరకొండను అనుకున్నాడట కొరటాల శివ. కానీ, విజయ్ తో సినిమా లేట్ అవుతుంది అని నవీన్ కి ఫిక్స్ అయ్యాడని సమాచారం. మొత్తానికి విజయ్ దేవరకొండకి నవీన్ పోలిశెట్టి మంచి పోటీ ఇస్తున్నాడని తెలుస్తుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి