సూపర్ స్టార్ మహేష్ బాబు తన నటనతో మంచి విజయాలను అందుకున్నప్పటికీ భారీ బడ్జెట్ తో తెరకెక్కిన కొన్ని సినిమాలు కూడా అట్టర్ ఫ్లాప్ ను చవి చూశాయి.. అలాంటి సినిమాలలో ఆగడు కూడా ఒకటి.. అనంతపురం జిల్లా తాడిపత్రి ప్రాంతాన్ని నేపథ్యంగా తీసుకొని తెరకెక్కించిన ఆగడు సినిమా భారీ డిజాస్టర్ ను చవిచూసింది.. ఇకపోతే అప్పటివరకు కోనవెంకట్ , శ్రీనువైట్ల కాంబినేషన్లో వచ్చే సినిమాలు అన్నీ విజయవంతం అయ్యాయి. కానీ వీరిద్దరూ మొదటిసారి ఈ సినిమా నుంచి విడిపోయారు.. కోన వెంకట్ కు. శ్రీను వైట్లకు మధ్య భేదాభిప్రాయాలు రావడంతో శ్రీను వైట్ల సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఎలాగైనా ఒక సినిమా తీయాలనుకుని గోపీ మోహన్ సహకారంతో శ్రీను వైట్ల సొంతంగా ఒక స్క్రిప్ట్ ను తయారు చేశారు.

ఎట్టకేలకు శ్రీను వైట్ల దర్శకత్వంలో 14 రీల్స్ పతాకంపై గోపి ఆచంట, రామ్ ఆచంట, అనీల్ సుంకర కలిసి నిర్మించిన సినిమా ఆగడు.. ఈ సినిమాలో సోనూసూద్ విలన్ గా నటించగా,  శృతి హాసన్ ప్రత్యేక పాత్రలో నటించి మెప్పించింది. ఇక తమన్నా హీరోయిన్ గా, మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ఈ చిత్రంలో పలువురు ప్రముఖులు నటించారు. ఇందులో మహేష్ బాబు ఒక పోలీస్ ఆఫీసర్ గా మనకు కనిపిస్తారు. సెప్టెంబర్ 19 2014 వ సంవత్సరం విడుదలైన ఈ సినిమా భారీ డిజాస్టర్ గా మిగిలింది. ఇక బడ్జెట్ పరంగా చూసుకుంటే ఈ సినిమాను  55 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు.


ఇక ప్రపంచ వ్యాప్తంగా 34.36 కోట్ల రూపాయలను వసూలు చేసి భారీ డిజాస్టర్ గా మిగిలింది ఈ సినిమా.. మొత్తంగా నిర్మాతలకు 21 కోట్ల రూపాయల లాస్ కూడా వచ్చింది.. తాడిపత్రి నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం కాబట్టి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి ..కాని కథ పరంగా ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయింది ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది అని చెప్పవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: