అంద‌మ‌యిన గోదావ‌రి లాంటి సినిమాలు కొన్నే తీశాడు .. తీయ‌గ‌ల‌డు కూడా! ఆయ‌న జోన‌ర్ అదే! దానిని దాటించి మౌనిక అనే పాత్ర‌లో సాయి ప‌ల్ల‌వి మీకు ఎదురైతే మంచిదే! ఏమ‌యినా ఇప్ప‌టికీ బాన్సువాడ భానుమ‌తి ని మ‌రిచిపోలేం. ఆ స్థాయి ఈ సినిమాలోనూ ఉంటుంద‌ని ఆశ. ఉండాలి. మ‌రో విష‌యం ఆయ‌న సినిమాల్లో హీరోయిన్ స్కిన్ షో చేయ‌దు. ఎంత అందంగా ఉన్నా కూడా ప‌ద్ధ‌తిగానే ఉంటుంది. ఈ రెండూ శేఖ‌ర్ కు మంచి అద‌న‌పు గుణాలు. ఇవే సంద‌ర్భంలో ఆయ‌న కొన్ని నేర్చుకోవాలి. సినిమాకు డాక్యుమెంట‌రీకి ఉన్న తేడా? అదేంటి అంటారా ఫిదా సెకండాఫ్ స‌న్నివేశాలు చూడండి అర్థం అవుతుంది. ఓ ఫిల్మ్ మేక‌ర్ సన్నివేశాల‌ను క‌థ‌లో భాగంగా ఉంచ‌డం త‌ప్పుకాదు కానీ క‌థ‌ను మ‌రింత ముందుకు తీసుకువెళ్ల‌నీయ‌కుండా ఉంచడంలో అర్థం ఏమీ ఉండ‌దు. అవును ఆయ‌న సినిమాల్లో క‌థ‌ను ప్రిడిక్ట్ చేయ‌డం సులువు. అయినా స‌రే ఆయ‌న న‌చ్చుతాడు. ఒక్క నిడివి అన్న ప‌దంలో త‌ప్ప‌! ఎందుక‌ని బోర్ కొట్టిస్తాడో అర్థం కాదు.



ఆనంద్ చూశారా డాక్యుమెంట‌రీ  నాలుగు గంట‌ల నిడివి. జ‌నం బాగానే స‌హించారు. పాట‌ల్లో ఉండే మ్యాజిక్కు అత‌ని మాటల్లో ఉండ‌దు. మంచిది అలా ఉండ‌క‌పోవ‌డం వ‌ల్ల మ‌నం హాయిగా సినిమా చూడ‌గ‌లం. భావోద్వేగాలు అనుకుని స‌న్నివేశాలు ఆయ‌న రాస్తారు అనుకుంటాను అంతేకానీ మాట‌లు న‌మ్ముకుని స‌న్నివేశాలు రాసే త్రివిక్ర‌మ్ త‌ర‌హా రైట‌ర్ అత‌ను కాదు. అయిన‌ప్ప‌టికీ నిడివి ఆయ‌న ఎడిట‌ర్ కు ఓ పెద్ద స‌వాలు.



శేఖ‌ర్ క‌మ్ముల సినిమాల‌న్నింటికీ ఎడిట‌ర్ మార్తాండ్ కే వెంకటేశ్. ఆయ‌న ఓ రేంజ్ ఎడిట‌ర్. ఇంకా చెప్పాలంటే తండ్రి వారసత్వం అందుకుని ఇటుగా అడుగులు వేసిన మార్తాండ్  ఈ సినిమాను ఎలా ఎడిట్ చేశాడు అన్న‌ది ఆస‌క్తిదాయకం. శేఖ‌ర్ సినిమాలు కాస్త డాక్యుమెంట‌రీ ఓరియెంటెడ్.. అవి క‌మ‌ర్షియ‌ల్ మ‌సాలాలు కావు. అందుకు అభినందించాలి కానీ సాగ‌దీత ధోర‌ణి అన్న‌ది ఎక్కువ స‌న్నివేశాలలో ఉంటుంది. వాన‌, పిల్ల‌లు, అమ్మాయిల సున్నిత‌త్వ‌పు భావ‌న‌లు ఇవ‌న్నీ బాగుంటాయి కానీ వీటికి తోడు మంచి క‌థ ఉండాలి. కొన్ని భావోద్వేగాలు న‌మ్ముకుని ఆయ‌న తీసే స‌న్నివేశాలు చాలా బాగుంటాయి. అవి క‌థ‌నంలో వేగాన్ని పెంచ‌వు. కొన్నింట ఆయ‌న ఫాస్ట్ నెస్ చూడాల‌నే అనుకుంటాం. మ‌న చుట్టూ ఉన్న కొంద‌రి మ‌నుషుల్లో ఉన్న విధంగానే ఆయ‌న సినిమా ల్లోనూ ఉన్న చెడు అంత చెడు కాదు., ఉన్న మంచి గొప్ప మంచికి మార్కు. మార్పు కోరుకుంటాడు. అది సున్నిత‌మ‌యిన భావోద్వేగాల‌తోనే చెప్పించి మార్పు కోరుకుంటాడు. ఆ విధంగా శేఖ‌ర్ ఓ మంచి క‌థ‌కుడు. డైలాగ్ రాస్తాడు ప‌ర్లేదు. మ‌రీ అంత దాచుకోద‌గ్గ మాట‌లేం రాయ‌క‌పోయినా మాట‌ల‌తో మ్యాజిక్కు చేయ‌డు. అదొక్క‌టి మెచ్చుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap