తనీష్ అల్లరికి అతడి నటనకు ఫిదా అయిపోయారు యువత. వరుస చిత్రాలు చేస్తూ బిజీ హీరోగా మారిపోయాడు. అయితే కథలు ఎంచుకోవడంలో పొరపాట్లు దొర్లడంతో వరుస ఫెయిల్యూర్ లు తనీష్ ను చుట్టుముట్టాయి. దాంతో అవకాశాలు తగ్గి అనూహ్యంగా కనుమరుగయ్యాడు హీరో తనీష్ ఆ తర్వాత కొన్నాళ్లకు బిగ్ బాస్ సీజన్ 2 లో ఎంట్రీ ఇచ్చాడు. తాజాగా "మరో ప్రస్థానం" మూవీ ద్వారా అలా మళ్ళీ కెరీర్ లో దూకుడు చూపిస్తున్నారు తనీష్. అయితే
తనీష్ గురించి కొన్ని సీక్రెట్స్ ను ఇపుడు తెలుసుకుందాం.
బిగ్ బాస్ సీజన్ 2 లోకి ఎంట్రీ ఇచ్చిన తనీష్ అక్కడ దీప్తి సునైనా కి బాగా క్లోజ్ అయిన విషయం తెలిసిందే. అయితే ఓ సారి దీప్తి తో తన కెరీర్ గురించి షేర్ చేసుకున్నాడు తనీష్. ఒకప్పుడు స్టార్ హీరోగా రాణించి...లక్షల పారితోషకం, విలాసవంతమైన భవనాలు, లగ్జరీ కార్లలో తిరిగిన తను ...మంచి స్క్రిప్ట్ లను ఎంచుకోకపోవడం వలనే తన కెరీర్ నాశనమైందని.. ఓ స్టేజ్ లో తన ఆస్తులను అమ్మి మరి రెండు కోట్ల వడ్డీ అప్పును కట్టానని తానే స్వయంగా చెప్పారు తనీష్.
* ఇక మరో విషయం ఏమిటంటే... మరోప్రస్థానం సినిమాకు ముందు తనకు మోకాలు సర్జరీ జరిగిందని తెలిపారు తనీష్.
* అలాగే బిగ్ బాస్ హౌస్ లో హీరో తనీష్ కి మరియు కౌశల్ కి మధ్య జరిగిన వివాదాలు గురించి అందరికీ తెలిసిందే. బయటకు వచ్చిన కొత్తల్లో కూడా ఒకరిపై ఒకరు విమర్శలు విసురుకుంటూ నిప్పులు కురిపించారు...అయితే ఆ వైరం వీరి మధ్య ఇప్పటికీ కొనసాగుతుందని ఇండస్ట్రీ ఇన్సైడ్ టాక్. మరి తన సెకండ్ ఇన్నింగ్స్ ద్వారా అయినా హీరోగా ఎక్కువ కాలం కొనసాగుతాడా చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి