అక్కినేని అఖిల్ ప్రస్తుతం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' సినిమా పూర్తి చేసి విడుదలకు సిద్ధంగా ఉంచిన సంగతి అందరికి తెలిసిందే. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్నారని అందరికి తెలిసిన విషయమే.

ఇందులో అఖిల్ పూజా హెగ్డే తో రొమాన్స్ చేసాడని తెలుస్తుంది. అందుకే ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయని సమాచారం. ఈ సినిమా ఎప్పుడో విడుదల అవ్వాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తుందట..

కానీ ఇన్ని వాయిదాల తర్వాత ఎట్టకేలకు దసరా బరిలోకి దిగేందుకు సిద్ధం అయ్యిందని తెలుస్తుంది.ఈ సినిమా దసరా రోజు అక్టోబర్ 15న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించినట్లు సమాచారం. ఇక అఖిల్ కూడా ఈ సినిమాపై గట్టి నమ్మకమే పెట్టుకున్నాడట. నాగార్జున కూడా ఈ సినిమా విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడని తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఒక వార్త మీడియాలో వైరల్ అవుతున్నట్లు సమాచారం.
ఇప్పటికే ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలను రీషూట్ చేసారని టాక్ వినిపిస్తుందట. అయితే ఇప్పుడు సినిమా విడుదల కూడా దగ్గర పడుతున్నట్లు తెలుస్తుంది. ఈ సమయంలో మళ్ళీ ఈ సినిమాలో కొన్ని మార్పులు చేయాలనీ నాగార్జున కోరుతున్నాడని సమాచారం. అయితే అవి ఎడిటింగ్ విషయంలో అవ్వడంతో చిత్ర యూనిట్ కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. నాగార్జున తన అనుభవంతో సినిమాలో చిన్న చిన్న మార్పులు చేయాలనీ చెప్పాడని సమాచారం.

నాగార్జున ప్రేక్షకుడి ద్రుష్టి కోణంతో ఆలోచించి జడ్జెమెంట్ ఇస్తారట. అందుకే నిర్మాత అల్లు అరవింద్ కూడా నాగార్జున చెప్పిన సన్నివేశాలను ఎడిట్ చేసేందుకు ఓకే చెప్పాడని వార్తలు వినిపిస్తున్నట్లు సమాచారం. ఇక దసరా సీజన్ లో పెద్ద సినిమాలు ఏవీ లేకపోవడంతో కొద్దిగా పాజిటివ్ టాక్ వచ్చిన మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్నారని సమాచారం. మరి ఈ సినిమా ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: