అందాల ముద్దుగుమ్మ తమన్నా తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇలా ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న తమన్నా ప్రస్తుతం టీవీ షోలలో కూడా కనిపిస్తూ బుల్లితెర అభిమానులను అలరిస్తోంది. అయితే తాజాగా తమన్నా మాస్టర్ చెప్ అనే బుల్లితెర షో ద్వారా జనాలను అలరిస్తోంది. మాస్టర్ చెప్ షో కు హోస్ట్ గా వ్యవహరిస్తున్న తమన్నా క్రేజ్ ను దృష్టిలో ఉంచుకొని ఈ షో నిర్వాహకులు తమన్నాకు భారీ రెమ్యునరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

 అయితే ఈ షో మొదటి కొన్ని ఎపిసోడ్ లకు మంచి ఆదరణ లభించినప్పటికీ, ఆ తర్వాత మాత్రం అంతగా ఆదరణ సాధించలేక పోయినట్లు తెలుస్తోంది. ఒకవైపు ఐపీఎల్ మరోవైపు ఎవరు మీలో కోటీశ్వరుడు, బిగ్ బాస్ షో ల తో కంపేర్ చేస్తే తమన్నా హోస్ట్ గా నిర్వహిస్తున్న మాస్టర్ చెప్ అంతగా జనాలను ఆకట్టుకోలేకపోవడంతో, షో ఖర్చు పరంగా చూస్తే తమన్నా కే భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ ఇవ్వడం, ఇతర జడ్జిలకు ఇచ్చే రెమ్యూనరేషన్ అన్ని కలిపి చూసుకుంటే షో నిర్వాహకులకు రాబడి కంటే ఖర్చు ఎక్కువగా కనబడుతుందట, దీంతో షో నిర్వాహకులు అగ్రిమెంట్ ప్రకారం తమన్నాతో చిత్రీకరించవలసిన సన్నివేశాలను చిత్రీకరించిన తమన్నకు గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక తమన్నా ప్లేస్ లో జబర్దస్త్ పోగ్రామ్ తో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న అనసూయ ను మాస్టర్ చెప్ షోకు హోస్ట్ గా ఎంపిక చేసుకున్నారు. ఇతర ఎంటర్టైన్మెంట్ షో లతో పోటీ పడుతూ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరుడు తో మంచి రేటింగ్ సాధించుకుంటే ముందుకు దూసుకుపోతుంది, కానీ తమన్నా హోస్ట్  గా నిర్వహించిన మాస్టర్ చెప్ మాత్రం ఆ రేంజ్ లో ఆదరణ దక్కించుకోలేకపోయింది అని తెలుస్తోంది. దీనితో అనసూయ ను మాస్టర్ చెప్ నిర్వహణ బృందం రంగంలోకి దింపింది. మరి అనసూయ ఎంట్రీ ఇచ్చిన తర్వాత మాస్టర్ చెప్ ఏ మేరకు జనాలను ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: