ఇటీవల కాలంలో వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు మెగా హీరో వరుణ్ తేజ్. నాగబాబు తనయుడిగా మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టి మంచి మంచి సినిమాలు చేసి ఇప్పటివరకు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆయన హీరోగా కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం గని.  స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుండగా విశేషం.

సినిమా కంటే ముందు గద్దల కొండ గణేష్  సినిమాతో సూపర్ హిట్ అందుకుని మంచి జోష్ లో ఉన్న వరుణ్సినిమా ను ఏరికోరి మరి చేయగా మెగా అభిమానులు గని చిత్రంపై కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. అంతే కాదు రెండు హ్యాట్రిక్ హిట్ చిత్రాలతో హిట్స్ సంపాదించి క్రేజీ స్టార్ గా ఉన్న వరుణ్ తేజ్ నుంచి రాబోతున్న చిత్రం కావడం ఇప్పుడు సినిమా పై మరిన్ని అంచనాలను పెంచుతుంది. ఇక ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ పంచ్ ను చిత్ర యూనిట్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులకు ఎంతో ఆసక్తి పెంచగా ఇప్పుడు ఈ ఫస్ట్ ఎలా ఉండబోతుందో అని అంతట ఎంతో ఆసక్తి నెలకొంది.

రేపు సాయంత్రం ఐదు గంటలకు ఈ ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలపగా దీని కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.  జగపతిబాబు ఉపేంద్ర సునీల్ శెట్టి నవీన్ చంద్ర వాటి క్రేజీ నటి నటులు ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తూ ఉండగా మొదటిసారి ఈ హీరో కి తమన్ సంగీతం అందిస్తుండటం విశేషం. ఇక ఈ సినిమాతో పాటే వరుణ్ తేజ్ వెంకటేష్ తో కలిసి ఎఫ్ 3 అనే సినిమాను చేస్తున్నాడు. ఈ చిత్రం కూడా దాదాపు చివరి స్థాయి షూటింగ్ జరుపుకుంటుంది. త్వరలోనే దీనికి సంబంధించిన విడుదల తేదీని ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు ప్రకటించనున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: