పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు,  ఆకాష్ పూరి చిన్నతనం నుండే అనేక సినిమాలలో నటించి ఎంతో మంది తెలుగు ప్రేక్షకుల మనుషులను దోచుకున్నాడు. ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆకాష్ పూరి ఆంధ్ర పోరి, మెహబూబా సినిమాలలో నటించాడు, ఈ సినిమాలు బాక్సాఫీస్ దగ్గ ర పెద్దగా ప్రభావం చూపక పోయినప్పటికీ, హీరోగా మాత్రం ఆకాష్ పూరి కి మంచి గుర్తింపు తీసుకొచ్చింది, ఇలా తెలుగు ప్రేక్షకుల నుండి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆకాష్ పూరి ప్రస్తుతం రొమాంటిక్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

పూరీ శిష్యుడు అనిల్ పాదూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి కథ - స్క్రీన్ ప్లే - డైలాగ్స్ ను పూరి జగన్నాథ్ అందించాడు. ఈ సినిమాలో కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఇ ది ఇలా ఉంటే ఈ సినిమాను దీపావళి సందర్భంగా నవంబర్ 4 వ తేదీ న విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం కొన్ని రోజుల క్రితం అఫీషియల్ గా ప్రకటించింది. అయితే ప్రస్తుతం ఈ సినిమా విడుదల తేదీ ని మార్చారు. ఆకాష్ పూరి హీరో గా నటిస్తున్న రొమాంటిక్ సినిమాను అక్టోబర్ 29 వ తేదీ న విడుదల చేయబోతున్నట్లు తాజా గా చిత్ర బృందం అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా చిత్ర బృందం రొమాంటిక్ సినిమా విడుదల తేదీ ని ప్రకటిస్తూ ఈ సినిమా హీరో, హీరోయిన్లు అయిన ఆకాష్ పూరి, కేతిక శర్మ లకు సంబంధించిన ఒక పోస్టర్  ను చిత్ర బృందం బయటకు వదిలింది. ఈ సినిమాతో ఆకాష్ పూరి బాక్సాఫీసు దగ్గర ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో తెలియాలంటే సినిమా విడుదల తేదీ వర కు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: