దీపావళి పండుగను తెలుగు రాష్ట్రాలలో ఎంతో ఘనం గా జరుపుకుంటారు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  ఊరువాడ మొత్తం దీపాల కాంతులతో వెలిగిపోతూ ఉంటుంది. అయితే తెలుగు ప్రజలందరికీ దీపావళి పండుగను మరింత ప్రత్యేకంగా మార్చేందుకు అటు ఈటీవీ నిర్వాహకులు ఒక ప్రత్యేకమైన ఈవెంట్ తో ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు  సాధారణంగా నే ఏదైనా పండుగ వచ్చిందంటే చాలు ఆ పండుగను మరింత గ్రాండ్ గా మార్చేందుకు ఈటీవీ నిర్వాహకులు ఏదో ఒక సరికొత్త ఈవెంట్ ప్లాన్ చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ప్రత్యేకమైన కార్యక్రమాల ద్వారా బుల్లితెర ప్రేక్షకులందరికీ పండగవేళ అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ అందిస్తూ వుంటారు.


 ఇకపోతే ఇటీవలే దీపావళి పండుగ సందర్భంగా తగ్గేదేలే అనే ఒక సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు  ఈ కార్యక్రమంలో నలుగురు హీరోయిన్లు కూడా జడ్జీలుగా పిలిచారు ఈటీవీ నిర్వాహకులు. ప్రస్తుతం ఢీ షో లో జోరుగా కొనసాగుతున్న ప్రియమణి, పూర్ణ జబర్దస్త్ జడ్జి రోజా సెల్వమణి శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి సంబంధించిన జడ్జి ఇంద్రజ ఇక మరో హీరోయిన్ మన్నారా చోప్రా ని స్పెషల్ గెస్ట్ లుగా పిలిచారు. ఇక ఈ కార్యక్రమానికి సంబంధించి ఇటీవలే విడుదలైన మొదటి ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ ప్రోమోలో భాగంగా ఐదుగురు హీరోయిన్లు ఒకేసారి డాన్స్ చేస్తే ఎలా ఉంటుంది అంటూ ప్రదీప్ గ్రాండ్ గా ఇంట్రడక్షన్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు  ఈ కార్యక్రమానికి సంబంధించిన మరో ప్రోమో విడుదల సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈ ప్రోమో లో భాగంగా జడ్జీలుగా వచ్చిన వారు అదిరిపోయే డాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు  అయితే ఇటీవలే అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాట విడుదలై ఎంత వైరల్గా  మారిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఈ పాటపై ఇటీవలే ఢీ షో జడ్జ్ పూర్ణ అదిరిపోయే డాన్స్ పర్ఫార్మెన్స్ చేసి ఆకట్టుకుంది. పూర్ణ డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తున్నంతసేపు బుల్లితెర ప్రేక్షకులు అందరూ కూడా కళ్ళార్పకుండా చూస్తున్నారు అని చెప్పాలి. ఎందుకంటే అంత అందంగా పూర్ణ పర్ఫామెన్స్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: