
టాలీవుడ్ సినిమా పరిశ్రమలో పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ వేరే. ఆయన సినిమా పై ప్రేక్షకులందరికీ ఎంతో ఆసక్తి ఉంటుంది. ప్రస్తుతం ఆయన నాలుగు సినిమాలను సెట్స్ పై ఉంచిన విషయం తెలిసిందే. వాటిలో ముందుగా సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న భీమ్లా నాయక్ సినిమా విడుదల అవుతుంది. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన లా లా అనే పాట విడుదల కాగా దానికి అదిరిపోయే రెస్పాన్స్ ప్రేక్షకుల నుంచి వస్తుంది.
ఈ పాట లకు అదిరిపోయే లిరిక్స్ రాశారు అగ్ర రచయిత త్రివిక్రమ్. తమన్ సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కొన్ని రోజుల నుంచి ఆయన ఏ పాట చేసినా కూడా అది సూపర్ హిట్ అవ్వడం ఆయన క్రేజ్ ఎలా ఉందో చెప్పడానికి నిదర్శనం. హ్యాండ్సమ్ హీరో రానా దగ్గుబాటి కూడా మరో హీరోగా ఈ చిత్రంలో నటిస్తుండగా ఈ పాట 24 గంటల్లోనే 10 మిలియన్ మార్క్ ను టచ్ చేసి సౌత్ ఇండియన్ లిరికల్ సాంగ్ లలోనే ఈ రికార్డు ను సృష్టించిన ఫస్ట్ పాటగా రికార్డు క్రియేట్ చేసింది.
మరి పవర్ స్టార్ ఈ సినిమాతో ఏ రేంజ్ లో హిట్ అందుకుంటాడో చూడాలి. ఇక ఈ చిత్రానికి త్రివిక్రమ్ వ్యవహరిస్తుండగా పవన్ సరసన నిత్యమీనన్ హీరోయిన్గా నటిస్తోంది. సంయుక్త మీనన్ రానాకు జోడీగా నటిస్తుంది. ఇక ఈ చిత్రం తర్వాత క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు చిత్రాన్ని విడుదల చేయనున్నాడు పవన్ కళ్యాణ్. వేసవిలో ఈ సినిమా విడుదల కాబోతు ఉండగా చారిత్రాత్మక నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మొదటిసారిగా నటిస్తుండడం విశేషం. ఇక ఈ రెండు చిత్రాల తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగవద్గీత అనే సినిమా చేస్తున్న పవన్ కళ్యాణ్ టాలీవుడ్ మోస్ట్ స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కూడా ఆయన ఓ సినిమా చేస్తున్నాడు.