సినిమా అంటే ప్రేక్షకులు ఎంత ఇష్టపడుతారు అనేది అందరికీ తెలిసిందే. ఇప్పుడు మనకు టాలీవుడ్ లో ఉన్న హీరోలకు అభిమానులు ఏ  రేంజ్ లో  ఉంటారు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు ప్రభాస్ కు ఉన్న ఫ్యాన్స్ రేంజ్ తెలిసిందే. ప్రభాస్ సినిమా వస్తుంది అంటే ఆ సినిమా అనౌన్స్ అయిన రోజు నుండి సినిమా విడుదల వరకు చిత్ర బృందం విడుదల చేసే ప్రతి ఒక్క వార్త కోసం ఎంతగానో ఎదురుచూస్తూ ఉంటారు. ఎంతో కాలంగా ఇదే  ట్రెండ్ నడుస్తూ ఉంది. అదే విధంగా గతంలో వచ్చిన ప్రభాస్ "సాహో" మూవీ కోసం ఎంతగా ఎదురు చూశారు మనము ప్రత్యక్షంగా చూశాము.  ఆ సినిమాకు ముందు వచ్చిన బాహుబలి పార్ట్ 1 అండ్ 2 రెండూ కూడా ప్రభాస్ ను ఒక రేంజ్ కు తీసుకెళ్ళాయి.

ఈ రెండు సినిమాల ఫలితంతో ఆ తర్వాత ప్రభాస్ నుండి వచ్చే సినిమాలపై అంచనాలు భారీగా పెట్టుకున్నారు.  ఇవన్నీ కలిపి సాహో నుండి  విడుదలయ్యే చిన్న అప్డేట్ కోసం ఆరాటపడ్డారు. అందులో భాగంగా ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్ కోసం రచ్చ చేశారు ఫ్యాన్స్. ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేయగానే ఇంకా ఎక్కువ మంది దీని పట్ల ఆకర్షితులు అయినారు. సినిమా విడుదలకు ముందుగా ట్రైలర్ ను వదిలారు. ఇక సినిమాలోని అసలు విషయం ఏమిటా అని ప్రేక్షకులు తలలు పట్టుకున్నారు. అలా ట్రైలర్ ను కట్ చేశాడు డైరెక్టర్ సుజిత్. అయితే ట్రైలర్ చూపించినంతగా సినిమాలో లేకపోవడం కొంచెం నిరాశ. ఒక హాలీవుడ్ మూవీ రేంజ్ లో ట్రైలర్ ఉంది.

దీనితో యూట్యూబ్ లో ఈ ట్రైలర్ విడుదలై 101 మిలియన్ వ్యూస్ ను దక్కించుకుని రికార్డు సృష్టించింది. అలా 30 ఆగస్ట్ 2019 న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో పాన్ ఇండియా మూవీగా విడుదల చేశారు. కానీ ఎందుకో ఈ సినిమా ప్రభాస్ అభిమానులను సంతృప్తి పరచలేక పోయింది. మరియు ఒక్క సినిమాతోనే పాన్ ఇండియా డైరెక్టర్ అయిన సుజిత్ ఈ సినిమాతో తేలిపోయాడు. కానీ ఈ సినిమాకు నష్టం మాత్రం రాలేదు. ఇది మొత్తం 350 కోట్ల బడ్జెట్ తో నిర్మించగా,  టోటల్ రన్ లో 432.4 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి పర్వాలేదు అనిపించింది. ఫలితం పక్కన పెడితే ఈ సినిమాతో ప్రభాస్ స్థాయి ఇంకా పెరిగిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: