తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకూ ఎంతోమంది హీరో హీరోయిన్లు కలిసి నటించడమే కాదు నిజజీవితంలో కూడాజీవిత భాగస్వాములు గా మారిపోయిన వారు చాలా మందే ఉన్నారు. కొన్నాళ్లపాటు సినిమాల్లో హీరో హీరోయిన్లు గా కలిసి నటించి ఇక ప్రేక్షకులందరికీ ఫేవరెట్ జంటగా మారిపోయిన వారు ఆ తర్వాత ప్రేమలో పడి పెళ్లితో ఒక్కటయ్యారు. ఇలాంటి వారిలో ఒకప్పుడు స్టార్ హీరోగా ఎన్నో ఏళ్ల పాటు తన హవాని నటించిన హీరో రాజశేఖర్.. కొన్నాళ్లపాటు  స్టార్ హీరోయిన్ రేంజికి సంపాదించి వరుస అవకాశాలు అందుకున్న జీవితం కూడా ఒకరు అని చెప్పాలి. పలు సినిమాల్లో కలిసి నటించిన ఇద్దరూ ఆ తర్వాత పెళ్లి చేసుకొని జీవిత భాగస్వాములు గా మారిపోయారు.


 అయితే పెళ్లి తర్వాత కూడా చిత్ర పరిశ్రమలో బాగా రాణించింది జీవితా రాజశేఖర్. దర్శకురాలిగా  మారి ఎన్నో సినిమాలను తెరకెక్కించింది.  సార్ హీరోయిన్ గా కొనసాగిన సమయంలో తన అభినయంతో ఎంత గుర్తింపు సంపాదించుకుంది జీవిత రాజశేఖర్. తలంబ్రాలు సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన జీవితా రాజశేఖర్.. ఆ తర్వాత ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల్లో నటించింది. కాగా ప్రస్తుతం జీవిత రాజశేఖర్ దంపతులకు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. ఇక వీరిలో శివాత్మిక ఇప్పటికే టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.



అయితే జీవిత రాజశేఖర్ కేవలం నటిగా మాత్రమే కాదు దర్శకురాలిగా కూడా ఎంతగానో గుర్తింపు సాధించింది. తన భర్త రాజశేఖర్ హీరోగా శేషు, మహంకాళి, సత్యమేవ జయతే లాంటి చిత్రాలకు దర్శకురాలిగా పని చేసింది జీవితా రాజశేఖర్. ఇక రాజకీయాల్లో కూడా ప్రవేశించి తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నించినప్పటికీ నిరాశ ఎదురైంది. ఇక బుల్లితెరపై కూడా వ్యాఖ్యాతగా మారి పలు చిత్రాలలో జీవిత రాజశేఖర్ అలరించారు. అయితే జీవిత అసలు పేరు పద్మ. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఈమె ఇక చిత్ర పరిశ్రమలోకి వచ్చిన తర్వాత తన పేరును జీవిత గా మార్చుతుంది. అయితే దాదాపు 50తమిళంలో చేసిన తర్వాత టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది జీవితా రాజశేఖర్.

మరింత సమాచారం తెలుసుకోండి: