సిరివెన్నెల సీతారామశాస్త్రి 35 సంవత్సరాల సినీ ప్రయాణంలో ఒక పాటల రచయితగా కొన్ని వేల పాటలను అందించారు. అందులో అన్ని పాటలు మధురంగా ఉంటాయి. కొన్ని సినిమాలలో అయితే అన్ని పాటలు ఈయనే అందించేవారు. కేవలం సిరివెన్నెల పాటలతో హిట్ అయిన సినిమాలు లేకపోలేదు. సిరివెన్నెల పాటలు అందించిన సినిమాల్లో కొన్ని మాత్రం ఎప్పటికీ ప్రత్యేకంగా నిలుస్తాయి. మరి అవేమిటో ఒకసారి చూద్దాం.

* సిరివెన్నెల

అందులో మొదటగా చెప్పుకోవాలంటే కె విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సిరివెన్నెల గురించి చెప్పుకోవాలి. తమ సినిమా కెరీర్ లో పాటలు అందించిన తొలి సినిమా ఇదే కావడం విశేషం. ఇందులో ఉన్న 9 పాటలు సిరివెన్నెల రచించారు. పాటలన్నీ అధ్బుతంగా ఉంటాయి.

* స్వయంకృషి

"కష్టే ఫలి" అనే కథాంశంతో తెరకెక్కిన స్వయం కృషి చిత్రానికి కె విశ్వనాధ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కొన్ని పాటలు మాత్రమే సిరివెన్నెల రచించారు. ఈ సినిమా కూడా మ్యూజికల్ గా బిగ్గెస్ట్ హిట్ అయింది.

* స్వర్ణ కమలం

ఆ తర్వాత కె విశ్వనాధ్ దర్శకత్వంలో వచ్చిన స్వర్ణ కమలం మూవీలో ఉన్న అన్ని పాటలు సిరివెన్నెల రచించినవే. ఈ సినిమాలో పాటలకు ఎంత ప్రాధాన్యత ఉందో తెలిసిందే.

* శ్రుతి లయలు

సినిమా కూడా కె విశ్వనాధ్ డైరెక్ట్ చేసిన చిత్రం కావడం విశేషం. ఇందులో తెలవరదేమో స్వామి...అనే పాటను సిరివెన్నెల రచించారు. ఈ పాటకు గానూ ఆయనకు జాతీయ అవార్డు లభించింది.

* రుద్రవీణ

కె బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన రుద్రవీణ మూవీ లోని పాటల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఇందులో సిరివెన్నెల రచించిన "నమ్మకు నమ్మకు... " తో పాటుగా మొత్తం 8 పాటలను రచించారు.

 * శివ

ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన శివ చిత్రంలో 'బోటని క్లాస్ ఉంది...' అంటూ సాగే పాట ఇండస్ట్రీని ఒక ఊపు వూపింది. ఈ పాటను రాసింది సిరివెన్నెల గారే.

* క్షణ క్షణం

సినిమా రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కింది. ఇందులో పాటలు కూడా మంచి ప్రాచుర్యం పొందాయి. వాటిలో ముఖ్యంగా 'జాము రాతిరి జాబిలమ్మ...' మరియు ' కో అంటే కోటి
..' పాటలు రచించిన సిరివెన్నెలకు మంచి పేరును తీసుకు వచ్చాయి.

ఇవి మాత్రమే కాకుండా గాయం, మనీ, గులాబీ, శుభలగ్నం, నిన్నే పెళ్లాడుతా లాంటి ఎన్నో చిత్రాలకు తన అద్భుతమైన పాటలను అందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: