సిల్క్ స్మిత ఈ పేరు వినగానే కుర్రాళ్ల నుండి ముసలి వాళ్ళ వరకు నరాలు జివ్వుమనేవి.. ఆమె తెరపై చూడగానే వారి మనసులు విహంగాలై తేలిపోతుండేవి. అంతేకాదు.. ఆమెను శృంగార రసాధిదేవతగా ఆదరించినా వారు ఎంతో మంది ఉన్నారు. ఇక ఆమె నర్తనంలో పట్టు కనిపించక పోయినా, ఆమె సౌష్టవం గుట్టుగా ప్రేక్షకుల మదిని కొల్లగొట్టేసింది. ఆమె ఆటకు జనం జేజేలు పలికారు. అలాంటిది నేడు సిల్క్ స్మిత పుట్టిన రోజు. ఆమె గురించి మరికొన్ని విషయాలను తెలుసుకుందామా.

సిల్క్ స్మిత వ్యక్తిగత జీవితంలోకి వెళ్తే.. ఆమె అసలు పేరు వడ్లపట్ల విజయలక్ష్మి. ఆమె ఏలూరు తాలూకా దెందులూరు మండలం కొవ్వలిలో 1960 డిసెంబర్ 2న విజయలక్ష్మి జన్మించారు. అయితే స్మిత నాల్గవ తరగతి దాకా చదువుకున్న విజయలక్ష్మి, ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు మానేసి తల్లిదండ్రులకు సహాయం చేస్తూ నిలించింది. ఇక ఆమెకి పదిహేనేళ్ళకే పెళ్ళి చేసి అత్తవారింటికి పంపించాక భర్త, అత్తమామలు వేధిస్తూ ఉండడంతో ఇంట్లో నుండి పారిపోయింది.

ఆలా ఇల్లు వదిలిన ఆమె మదరాసు చేరి, తొలుత టచప్ ఆర్టిస్ట్ గా పనిచేశారు. ఆ తరువాత ఆమె హీరయిన్లకు టచప్ చేస్తున్న సమయంలోనే బిట్ రోల్స్ లో నటించే అవకాశం అందుకుంది. ప్రముఖ మళయాళ దర్శకుడు ఆంథోనీ ఈస్ట్ మన్ దర్శకత్వం వహించిన ‘ఇనయె తేడీ’ చిత్రంలో స్మితకు తొలిసారి నాయిక పాత్రలో నటించింది. ఈ చిత్రానికి ముందు స్మిత తమిళంలో ‘వండిచక్రం’ అనే సినిమాలో కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాలతో స్మితకి తమిళ, మళయాళ చిత్రసీమల్లో మంచి పేరు, గుర్తింపు తీసుకొచ్చాయి.

అయితే తమిళ్ సినిమా అయినా ‘వండి చక్రం’ తెలుగులో ‘ఘరానా గంగులుగా రీమేక్ చేశారు. ఈ సినిమాతో స్మిత తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైంది. అంతేకాదు.. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాలో నటించి మంచి పేరు గుర్తింపు తెచ్చుకుంది. ఎంతో పేరు, ప్రతిష్ఠలు సంపాదించుకున్న స్మిత చివరకి ఆత్మహత్య చేసుకొని చనిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: