ఒకప్పుడు ప్రేక్షకులందరూ వెండితెరపై సినిమా చూసేందుకు ఎక్కువగా ఇష్టపడేవారు. సినిమాల్లో కమెడియన్స్ చేసే కామెడీతో కడుపుబ్బా నవ్వుకునే వారు. ఇంతకంటే గొప్ప కామెడీ అసలు ఉండదు అని అనుకునేవారు.. కానీ అసలు సిసలైన కామెడీ అంటే ఇలాగే ఉంటుంది అని ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమం నిరూపించింది. ఒక సాదాసీదా కామెడీ షో గా ప్రారంభమైన జబర్దస్త్ ఇక ఇప్పుడు బుల్లితెర చరిత్రలోనే ఏ కామెడీ షో కి సాధ్యం కాని రికార్డులను సొంతం చేసుకుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎన్నో ఏళ్ల నుంచి ఎంతో విజయవంతంగా దూసుకుపోతోంది జబర్దస్త్ కార్యక్రమం.



 టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటూ బుల్లితెరపై సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది   అంతేకాదండోయ్ అటు ఇండస్ట్రీ లోకి రావాలి సెలబ్రిటీ గా మారాలి అనుకుంటున్న ఎంతోమంది కమెడియన్స్ కు జబర్దస్త్ కార్యక్రమం లైఫ్ ఇచ్చింది అని చెప్పాలి. ఇప్పటివరకు జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది కొత్త కమెడియన్స్ రావడం టాలీవుడ్ సినిమాల్లో అవకాశాలు దక్కించుకోవడం కూడా జరిగింది. అయితే అప్పుడప్పుడు జబర్దస్త్ లో మార్పులు చేస్తూ ఉంటారు. టీం లీడర్లను మార్చడం కొత్త వారికి అవకాశం ఇవ్వడం చేస్తూ ఉంటారు.


అయితే ప్రస్తుతం జబర్దస్త్ లో మార్పులు చేయబోతున్నారా అంటే అవుననే టాక్ వినిపిస్తోంది. ఎన్నో రోజుల నుంచి కొత్త కమెడియన్స్ జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇవ్వలేదు. ఈ క్రమంలోనే జబర్దస్త్ లో టీమ్స్ లో కూడా కొన్ని మార్పులు చేయాలని నిర్వాహకులు భావిస్తున్నట్లు గత కొన్ని రోజుల నుంచి  టాక్ వినిపిస్తోంది. కాగా ఇటీవల విడుదలైన జబర్దస్త్ ప్రోమో లో భాగంగా రాకెట్ రాఘవ చెప్పిన డైలాగ్ తో ఇది నిజమే  అని అందరూ ఫిక్సై పోతున్నారు అని చెప్పాలి. ఇటీవల విడుదలైన ప్రోమో లో భాగంగాఒక స్కిట్ లో రాఘవ చంటి ఇద్దరు కలిసి చేస్తారు. ఈ క్రమంలోనే ఇద్దరు కలిసి చేయాలి... ఇక కలిసి చేయడంలో ఉండే మజా... ఆ కలయిక అనేది ఉంటుంది చూసావా అంటూ చంటి డైలాగ్ చెబుతూ ఉంటాడు. ఇక వెంటనే అందుకున్న రాఘవా అన్నిసార్లు కలిసి కలిసి అనకండి అసలే డైరెక్టర్లు మార్పు కోసం ట్రై చేస్తున్నారు. ఇలా అన్నారు అంటే ఇద్దరిని కలిపి ఒకే టీమ్ లో పెట్టగలరు అప్పుడు పీక్కోలేక లాక్కోలేక చావాలి అంటూ రాకెట్ రాఘవ అంటాడు. దీంతో నిజంగానే జబర్దస్త్ లో మార్పులు రాబోతున్నాయి అని అనుకుంటున్నారు ప్రేక్షకులు

మరింత సమాచారం తెలుసుకోండి: