ఇండస్ట్రీకి ఎప్పుడు ఎవరు వచ్చిన అందరికి ఆహ్వానం పలుకుతూనే ఉంటుంది. వారిలో టాలెంట్ బయటపెట్టడానికి ఇండస్ట్రీకి చాలా మంది వస్తుంటారు. అలా వచ్చిన వారిలో అదృష్టం కలిసి వచ్చి నటులుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారూ ఉన్నారు. ఇండస్ట్రీలోకి రావాలని చాలా మంది కలలు కంటూ ఉంటారు. ఇక వారి కలలని నెరవేర్చుకోవడానికి సినీ ఇండస్ట్రీలోకి అడుగులు వేస్తుంటారు. అంతేకాదు.. సినిమాలపై పిచ్చి ఎక్కువ ఉన్న వాళ్ళు.. ఎలాంటి పాత్ర దొరికినా పని చేయడానికైనా రెడీగా ఉంటారు. కాగా.. చిత్ర పరిశ్రమలో కొత్త, పాత అనే భేదాలు ఉండవు. ఎవరు వచ్చిన స్వగౌరవంగా ఆహ్వానం పలుకుతుంది.

అయితే ప్రముఖ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టినప్పుడు నటనకు పనికి రావని చాలా మంది అన్నారని ఒకానొక సందర్భంలో చెప్పుకొచ్చారు. ఇక ఎవరి ప్రస్థానమైనా చిన్నస్థాయి నుంచి మొదలై అగ్రస్థానానికి చేరుతుంది' అని అన్నారు సీనియర్‌ నటుడు మోహన్‌బాబు. అయితే మోహన్ బాబు రుద్రంకోట టైటిల్‌ లుక్‌ పోస్టర్‌ను విడుదల చేయడానికి ముఖ్య అతిథిగా వెళ్లారు. ఈ సినిమాలో  సీనియర్‌ నటి జయలలిత ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకి అనిల్‌ కండవల్లి నిర్మాత. కోన రాము దర్శకుడుగా వ్యవహరిస్తున్నారు. కాగా.. ఈ సినిమాలో అనిల్‌, విభీష కలిసి నటుస్తున్నారు.

ఇక ఈ సందర్భంగా మోహన్‌బాబు మాట్లాడుతూ... జయలలితతో ముప్పై ఏళ్లుగా పరిచయం ఉందని చెప్పుకొచ్చాడు. ఆమె అంటే ఈ రోజుకూ నాకు గౌరవం, ప్రేమ ఉన్నాయని అన్నారు. ఇక ఆమెపై ఉన్న అభిమానంతోనే ఈ వేడుకకు వచ్చానని అన్నారు. అయితే సమర్పకురాలిగా ఆమె వేస్తున్న మొదటి అడుగు విజయవంతం కావాలి. చిన్న నిర్మాత బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుందని అన్నారు. ఇక జయలలిత మాట్లాడుతూ.. గ్రామీణ నేపథ్యంలో సాగే కథ ఇది అని చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో కోటమ్మగా నా పాత్ర విభిన్నంగా ఉంటుందని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: