టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా బోయపాటి శ్రీను కి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.మాస్ చిత్రాల స్పెషలిస్ట్ గా బోయపాటికి ఇండ్రస్ట్రీ లో భారీ గుర్తింపు ఉంది.కానీ ఇటీవల ఒక్క ప్లాప్ తో మళ్ళీ వెనకబడి పోయాడు. ఇటీవల రామ్ చరణ్ తో బోయపాటి శ్రీను తెరకెక్కించిన వినయ విధేయ, రామ సినిమా బాక్సఫీస్ దగ్గర డిజాస్టర్ ని సొంతం చేసుకుంది. ఆ సినిమా ఘోరంగా ప్లాప్ అవ్వడంతో బోయపాటి పనైపోయిందని అందరూ అనుకున్నారు. కానీ తాజాగా బాలకృష్ణ తో బోయపాటి శ్రీను తెరకెక్కించిన అఖండ సినిమా విడుదలై మొదటి రోజే బాక్సాఫీస్ దగ్గర భారీ స్థాయిలో ఓపెనింగ్స్ ని అందుకొని బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతోంది.

దీంతో అఖండతో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కాడు ఈ దర్శకుడు. ప్రస్తుతం అఖండ సినిమా అభిమానులతో పాటూ మాస్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది.ఈ సినిమా రెండు రోజుల్లోనే 40 కోట్లకు పైగా గ్రాస్ ని కలెక్ట్ చేసి షాక్ ఇచ్చింది.శని, ఆదివారాలు ఇంకా కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది.ఇక ఈ సినిమా భారీ విజయం అందుకోవడంతో ఇప్పుడు అగ్ర హీరోలు కూడా బోయపాటి శ్రీను తో సినిమా చేయడానికి రెడీగా ఉన్నారు.ఇక తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం బోయపాటి లిస్టులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో పాటూ తమిళ స్టార్ హీరో సూర్య కూడా ఉన్నాడట.ఇక సూపర్ స్టార్ మహేష్ బాబుతో కూడా ఎప్పటినుంచో..

 ఒక మాస్ యాక్షన్ సినిమా చేయాలని అనుకుంటున్నాడు.అటు మరోవైపు యంగ్ హీరో రామ్ పోతినేని తో కూడా ఒకసారి చర్చలు జరిపినట్లు సమాచారం.అయితే వీరందరిలో ముందుగా అల్లు అర్జున్ తోనే బోయపాటి సినిమా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే బన్నీ కి బోయపాటి కథ కూడా వినిపించాడట. బోయపాటి చెప్పిన కథ కూడా బన్నీకి బాగా నచ్చినట్లు తెలుస్తోంది.వచ్చే ఏడాది ఆరంభంలో బన్నీ, బోయపాటిసినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం.ఇక బన్నీ తర్వాత మిగతా స్టార్ హీరోలు బోయపాటితో ఎలాంటి సినిమాలు చేయడానికి ఒప్పుకుంటారో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: