తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ గురించి మాటలు లేవు.. మాట్లాడుకోవడం లేదు. ఎంటర్టైన్మెంట్ అంటూ ఏదేదో బూతులు చూపిస్తూ యువతను ఆకట్టుకుంటూ వస్తున్నారు. ఇలా నాలుగు సీజన్లు పూర్తి చేసుకున్నారు. ఇప్పుడు గత రాత్రి తో ఇదో సీజన్ కూడా పూర్తి చేసుకున్నారు. మొత్తానికి నిన్న సీజన్ లో విజె సన్నీ విజేత గా నిలిచారు. హౌస్ లో వున్న వాల్లందిరి లో ఇతనే జన్యున్ గా ఆడి జనాలను మెప్పించాడు. అలా ఇప్పుడు బాగా ఫెమస్ అయ్యాడు.


సీజన్ విన్నర్ అయినందుకు ఇతని ఆనందం మాములుగా లేదు. విజయాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఆదివారం ఎపిసోడ్ లో ఇతగాడి హంగామా మాములుగా లేదు. షో కు వచ్చే ముందుకు తల్లికి విన్నర్ అవుతానని మాట ఇచ్చాడు . అలానే చివరకు విన్నర్ అయ్యి, ఏకంగా తల్లి చేతుల మీదుగా ట్రోఫీ ని అందుకున్నాడు. షో నుంచి బయటకు వచ్చిన తర్వాత అరియాన వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ బజ్ షో లో ఇంటర్వ్యూ ఇచ్చాడు.


హౌస్ లో ఉన్న వారందరి గురించి చెప్పుకుంటూ వచ్చాడు. మామూలు రోజుల్లో ఎలా ఉంటారు. వీకెండ్ వస్తే ఎలా ఉంటారు అనే విషయాన్ని వివరించాడు. ముఖ్యంగా శ్రీరామ్ చంద్ర గురించి చెప్పుకొచ్చాడు.విశ్వ గేమ్‌ అంటే ప్రాణమిస్తాడు. నటరాజ్‌ మాస్టర్‌ హార్డ్‌ వర్కర్‌, అతడిని ముద్దుగా సింహం అని పిలిస్తారు. ఇక సరయు గురించి చెప్పే లోపు వెళ్ళింది. ప్రియాంక గురించి చెప్పాలంటే మాటలు చాలవు..అలాంటి అమ్మాయి దొరకాలంటే రాసిపెట్టి ఉండాలి అంటూ తనపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇలా అందరి గురించి చెప్పాడు. పింకీ లాంటి అమ్మాయి అయితే నేను పెళ్ళికి రెడీ అని సన్నీ అన్నాడు. ప్రస్తుతం సన్నీ సినిమా లో నటించె అవకాశాలు ఉన్నాయి.ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: