ఈ పాట తెరపై ఉన్నంత సేపు ప్రేక్షకులు సీట్లో నిలవలేదు...థియేటర్ మొత్తం విజిల్స్ తో హోరెత్తిపోయింది. ఇందులో సామ్ లుక్ మునుపెన్నడు లేని విధంగా చాలా కొత్తగా ఉంది. ఈ పాటలో అదిరిపోయే డ్యాన్స్ తో యువతని ఫిదా చేసింది సామ్. అయితే ఈ స్పెషల్ సాంగ్ ఆఫర్ తొలుత వేరే హీరోయిన్ కి వచ్చిందట...నిజానికి ఈ సాంగ్ కోసం ముందుగా సమంత లేదా పూజ హెగ్డే అని అనుకున్నారట. అయితే చివరికి సామ్ నే ఫిక్స్ చేశారట ...అలా ఈ స్పెషల్ సాంగ్ ఛాన్స్ పూజ కు మిస్స్ అయ్యిందో లేక మిస్స్ చేసుకున్నారో తెలియదు గానీ మొత్తానికి పుష్ప చిత్రం లో స్పెషల్ సాంగ్ తో సమంత హంగామా మామూలుగా లేదు.
ఈ సినిమా నుండి సమంత హీరోయిన్ గానే కాక, ఒక ఐటెం గర్ల్ గా కూడా బాగా పోల్\పులర్ అయి ఎంతోమంది డైరెక్టర్స్ కు ఛాయస్ గా ఉండనుందా అన్నది తెలియాల్సి ఉంది. ఇక సుకుమార్, బన్నీ కాంబోలో వచ్చిన ఈ హ్యాట్రిక్ మూవీ హిట్ టాక్ గట్టిగానే వినిపిస్తోంది. అల్లు అర్జున్ ఊరమాస్ పర్ఫార్మెన్స్ తో ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ పార్టీ ఇచ్చేశారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి