ప్రభాస్‌ 'బాహుబలి' వరకు దక్షిణాది ఇండస్ట్రీలోనే ఉండిపోయాడు. పక్కమార్కెట్‌ పై పెద్దగా ఏకాగ్రత పెట్టలేదు. అయితే రాజమౌళి తీసిన 'బాహుబలి'తో ప్రభాస్‌ గ్రాఫ్‌ మారిపోయింది. ఈ మూవీ నార్త్‌లో భారీగా కలెక్ట్ చేయడంతో ప్రభాస్‌కి బాలీవుడ్ పై నమ్మకమొచ్చింది. దీంతో తెలుగు, హిందీ ఇండస్ట్రీలలో వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు.  

ప్రభాస్‌ 'బాహుబలి2' విడుదలకు ముందు సుజిత్‌తో 'సాహో' సినిమా మొదలుపెట్టాడు. ముందు ఈ సినిమాని రీజనల్‌ మూవీగానే చెయాలనుకున్నాడట ప్రభాస్. అయితే 'బాహుబలి2' 1500 కోట్లకి పైగా కలెక్ట్ చేశాక 'సాహో' స్కేల్‌ మారింది. పాన్‌ ఇండియన్‌ మూవీగా మారింది. ఈ సినిమాకి తెలుగులో మిక్స్‌డ్ టాక్ వచ్చినా, హిందీలో సూపర్‌ హిట్‌ అయ్యింది. అప్పటినుంచి ప్రతీ సినిమాని తెలుగు, హిందీలో చేస్తున్నాడు. హిందీలో ఓన్‌ డబ్బింగ్‌ కూడా చెప్పుకుంటున్నాడు. రామ్ చరణ్ ఇంతకుముందే 'జంజీర్' సినిమాతో హిందీకి వెళ్లాడు. కానీ ఈ సినిమా డిజాస్టర్ అయ్యాక తెలుగుకే పరిమితమయ్యాడు చరణ్. అయితే ఇప్పుడు రాజమౌళి బ్రాండ్‌తో మళ్లీ నార్త్‌కి వెళ్తున్నాడు. హిందీ వాళ్లకి ఒరిజినల్‌గా కనెక్ట్‌ కావడానికి హిందీలో డబ్బింగ్‌ కూడా చెప్పుకున్నాడు చరణ్. పనిలోపనిగా తమిళ్, కన్నడలోనూ సొంత గొంతునే వినిపించాడు చరణ్.

'ఆర్ ఆర్ ఆర్' ప్రమోషన్స్‌లో జూ.ఎన్టీఆర్ ఎనర్జీ చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఆ హైపర్‌నెస్‌కి జనాలు కూడా సర్‌ప్రైజ్ అవుతున్నారు. అయితే అటామిక్‌ ఎనర్జీని కరెక్ట్‌గా వాడుకుంటేనే అవుట్‌పుట్‌ కూడా అందిరికి ఉపయోగపడుతుంది అన్నట్లు, తారక్‌ని మల్టీమార్కెట్స్‌లోకి తీసుకెళ్తున్నాడు రాజమౌళి. 'ఆర్ ఆర్ ఆర్'తో కొమరం భీమ్‌గా ఇండియన్‌ ఫిల్మ్‌ మార్కెట్‌లో అడుగుపెడుతున్నాడు జూ.ఎన్టీఆర్. ఇక ఈ సినిమా కోసం తమిళ్, కన్నడ, హిందీల్లోనూ డబ్బింగ్‌ చెప్పుకున్నాడు తారక్. సినిమా రిపోర్ట్.. ట్రేడ్‌ రిజల్ట్‌ వీటన్నింటి కంటే ముందు ఆడియన్స్‌కి కనెక్ట్ కావడం ముఖ్యం. ప్రేక్షకులకి దగ్గరైతే స్టార్డమ్, మార్కెట్‌ అన్నీ వచ్చేస్తాయి. ఒక బ్రాండ్‌ కూడా క్రియేట్ అవుతుంది. ఈ బ్రాండ్‌ క్రియేట్  చేసుకోవడానికి ఆడియన్స్‌కి ఒరిజినాలిటీ చూపించడానికి పక్క మార్కెట్స్‌లో కూడా సొంత డబ్బింగ్‌తోనే జనాలముందుకెళ్తున్నారు స్టార్లు.

విజయ్‌ దేవరకొండ ఎప్పటినుంచో మార్కెట్‌ పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. 'డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాలని దక్షిణాదిలో నాలుగు భాషల్లో రిలీజ్ చేశాడు. కానీ వర్కవుట్‌ కాలేదు. అయితే ఇప్పుడు పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో హిందీ మార్కెట్‌ని టార్గెట్‌ చేశాడు. తెలుగు, హిందీల్లో 'లైగర్' షూటింగ్‌ చేశాడు. బాక్సింగ్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమా అయిదే భాషల్లో రిలీజ్ అవుతోంది. వీటిల్లో తెలుగుతో పాటు హిందీలో కూడా డబ్బింగ్‌ చెప్పుకుంటున్నాడు విజయ్.



మరింత సమాచారం తెలుసుకోండి: