నాగ చైతన్య, నాగార్జున ,రమ్యకృష్ణ , కృతి శెట్టి కలసి తాజాగా నటించిన చిత్రం బంగార్రాజు.. ఈ రోజు భోగి పండుగ సందర్భంగా ఈ చిత్రాన్ని థియేటర్లో చాలా గ్రాండ్ గా విడుదల చేశారు. ఇకపోతే తాజాగా ఈ సినిమా విడుదలైన సందర్భంగా ఈ సినిమాలో ఒక పాటలో జాంబి రెడ్డి భామ దక్ష నాగర్కర్ , నాగ చైతన్యతో కలిసి స్టెప్పులేసింది. ముంబై ముద్దుగుమ్మ దక్ష నాగర్కర్ ఎక్కువగా దక్షిణాది ఫిలిం ఇండస్ట్రీలోనే నటించింది. మొదటిసారి 2015లో హోరాహోరీ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత 2018 లో కూడా హుషారు సినిమాలో నటించింది దక్ష. 2021 లో విడుదలైన జాంబి రెడ్డి సినిమాతో ఈమెకు మంచి పేరు వచ్చిందని చెప్పవచ్చు.

ఇక ఆ గుర్తింపు తోనే ఈమె బంగార్రాజు సినిమాలో ఒక పాటలో డాన్స్ వేయడానికి అవకాశాన్ని పొందింది. ఇక ఈ పాటలో నాగచైతన్యతో పాటు డాన్స్ వేసిన ధక్ష తాజాగా నాగచైతన్య కు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే దక్ష తన ఇంస్టాగ్రామ్ లో ఏకంగా 350 K ఫాలోవర్స్ ను కలిగి ఉంది. అంతేకాదు ఈమె ఎప్పటికప్పుడు ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ ప్రేక్షకులకు మరింత దగ్గరైంది..


ఇక నాగచైతన్య గురించి మాట్లాడుతూ.. చాలా మంచి మనిషి.. కూల్ గా ఉంటారు.. నేను ఈ పాటకు స్టెప్పులు పూర్తిగా నేర్చుకునే వరకు నాగచైతన్య వెయిట్ చేస్తూ వచ్చారు అని చెబుతూనే మొదటి డాన్స్ పార్ట్ నర్ అంటూ అభివర్ణించింది. ఇక నాగచైతన్య సెట్స్లో అందరితో చాలా సరదాగా జోకులు వేస్తూ ఉంటాడు.. నాగచైతన్యకు సహనం ఎక్కువ.. ఆయనతో కలిసి పనిచేయడం నాకు గొప్ప అనుభూతి లాగా అనిపిస్తోంది అంటూ తెలిపింది. అయితే మొదట తను ఈ పాటకు ఒప్పుకోలేదు అని , దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఈ పాటకు సీక్వీన్స్ ను పూర్తిగా వివరించడం తో ఒప్పుకున్నాను అంటూ తెలిపింది దక్ష.

మరింత సమాచారం తెలుసుకోండి: