హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా టాలీవుడ్ లో పవర్ స్టార్ గా తన క్రేజ్ ని అంతకంతకూ పెంచుకుంటూ పోతున్నారు పవన్ కళ్యాణ్. అయితే ఎన్నో ఏళ్ల పాటు  సినిమాలకు దూరమైన పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ అనే సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చారు. తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు అన్న విషయం తెలిసిందే. ఒకవైపు సినిమా షూటింగ్ లో శరవేగంగా పాల్గొంటూనే మరోవైపు  రాజకీయాలను కూడా బాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు పవన్ కళ్యాణ్. ఇకపోతే ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భీమ్లా నాయక్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు దగ్గుబాటి వారసుడు రానా కూడా నటిస్తూ ఉండటం గమనార్హం. తర్వాత క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు అనే సినిమాలో కూడా నటిస్తున్నారు పవన్ కళ్యాణ్.


 ఇక ఈ సినిమాలతో పాటు అటు హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ అనే చిత్రంలో కూడా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్ ప్రేక్షకుల అందరినీ ఆకర్షించింది అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్లో గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఇక ఇప్పుడు భవదీయుడు భగత్ సింగ్ అనే సినిమా మరికొన్ని రోజుల్లో సెట్స్ పైకి  వెళ్లబోతోంది అన్నది తెలుస్తుంది. అయితే గబ్బర్ సింగ్ లాంటి హిట్ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతూ ఉండడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక మరో సారి అభిమానులు కోరుకునే విధంగానే ప్రేక్షకులకు పవన్ కళ్యాణ్ ను భవదీయుడు భగత్ సింగ్ అనే సినిమాలో హరీష్ శంకర్ చూపించబోతున్నాడు అని ప్రేక్షకులు బలంగా నమ్ముతున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లెక్చరర్ గా కనిపించబోతున్నాడు అంటూ గత కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి.. ఇకపోతే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ను ఢీ కొట్టడానికి ఒక పవర్ ఫుల్ స్టార్ హీరో ని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కోలీవుడ్లో స్టార్ హీరోగా తమిళ ప్రేక్షకులకు మక్కాల్ సెల్వన్ గా కొనసాగుతున్న విజయ్ సేతుపతి పవన్ కళ్యాణ్ సినిమాలో విలన్ గా నటించబోతున్నాడట. ఉప్పెన, మాస్టర్ లాంటి సినిమాల్లో విలనిజాన్ని ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్న విజయ్ సేతుపతి.. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలో మరింత పవర్ ఫుల్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు చేసిన అన్ని సినిమాల కంటే ఇక పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా లో విజయ్ సేతుపతి విలనిజంమరో స్థాయిలో చూపించబోతున్నాడు అని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: