ఇక ఆ ఫోటోని షేర్ చేస్తూ.. తన ప్రేమకు నేను ఓకే చెప్పానని చెబుతూ.. ఒక అబ్బాయితో కలిసి ఉన్న ఫోటోను సుప్రీత షేర్ చేసింది. దీంతో ఆమె ఫాలోవర్స్ ఎవరు అబ్బాయి అనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేయగా.. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. సుప్రీత తో ఉన్న ఆ అబ్బాయి పేరు రాఖీ జోర్డాన్.. ఇతను ఒక ర్యాపర్ ఆల్బమ్స్ చేస్తూ ఉంటాడు. ఇక వీరిద్దరూ కలిసి ఒక ప్రైవేట్ ఆల్బమ్ లో కూడా నటిస్తున్నట్లు సమాచారం. ఇక అందుకు సంబంధించి త్వరలోనే ఒక వీడియో సాంగ్ ను కూడా విడుదల చేయబోతున్నట్లు సమాచారం.
అయితే కొద్ది రోజుల క్రిందట నందు అనే అబ్బాయిని కూడా ఇలాగే పోస్ట్ పెట్టినప్పుడు నెటిజెన్స్ ఎవరా అని అడగగా.. బెస్ట్ ఫ్రెండ్ అని తెలియజేసింది. అయితే నందు గురించి అలా తెలియజేసిన కొద్దిరోజులకే ఇప్పుడు రాఖీ జోర్డాన్ తో లవ్లో ఉన్నట్లు గా తెలియజేసింది. ప్రస్తుతం ఈ విషయంపై నెటిజన్లు తనదైన శైలిలో స్పందిస్తూ.. కొందరు కంగ్రాట్స్ తెలుపగా.. మరికొందరు తన బాధను వ్యక్తం చేస్తున్నారు.. మరికొందరైతే ఏకంగా మీరిద్దరు విడిపోవాలని కోరుకుంటున్నప్పుడు గా కామెంట్ చేయడం గమనార్హం. ఇక దీనిపై తన తల్లి ఏమంటుందో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి