సినిమా పరిశ్రమలో సక్సెస్ ఉంటేనే సినిమా అవకాశాలు వస్తాయని ఎవరు చెప్పారో కానీ అది తప్పు అని నిరూపిస్తున్నారు కొంతమంది హీరోలు. వీరు సక్సెస్ లేకున్నా కూడా సినిమా అవకాశాలు అందుకుంటూ తమ కెరియర్లో ఎప్పుడూ లేనివిధంగా బిజీగా ఉంటున్నారు. సక్సెస్ ఉంటే సినిమా అవకాశాలు వస్తాయి అనేది తప్పు అని వారు నిరూపిస్తున్నారు. అలా టాలీవుడ్ లో భారీ ఫ్లాపులు అందుకున్న కూడా ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆలచించడానికి సూపర్ హిట్ కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు కొంతమంది హీరోలు వారు ఎవరు ఇప్పుడు చూద్దాం. 

టాలీవుడ్లో ఎప్పటినుంచో సినిమాలు చేస్తున్న కూడా సరైన సక్సెస్ను అందుకున్న హీరోల్లో మొట్ట మొదటగా మనం సందీప్ కిషన్ గురించి చెప్పుకోవాలి. ఆయనకు సక్సెస్ వచ్చి చాలా రోజులు అయింది అని చెప్పాలి. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా ఆయన కెరియర్ లోనే ఏకైక హిట్ సినిమా. ఆ తర్వాత ఆయన హిట్ సాధించిన దాఖలాలు లేవు. అయినా కూడా ఇప్పటికీ అరడజను సినిమాలకు పైగా ఆయన చేతిలో ఉన్నాయి అంటే ఆశ్చర్యపోవాల్సిందే. ఇక ఫ్లాపులు ఎదురవుతున్న కూడా అవేవి పట్టించుకోకుండా వరస సినిమా అవకాశాలను రాబట్టుకున్నాడు మరొక హీరో నాగ శౌర్య. 

ఆయన హీరోగా చేసిన ఛలో సినిమా అనే ఆయన కెరీర్లో చెప్పుకోదగ్గ హిట్ సినిమా. ఆ తర్వాత ఆయన ఎన్ని ప్రయత్నాలు ఎన్ని వెరైటీ సినిమాలు చేసినా కూడా ప్రేక్షకులు ఆ సినిమాలను యాక్సెప్ట్ చేయలేదు. ఫలితంగా భారీ ఫ్లాపులు ఎదురయ్యాయి. అయినా కూడా ఆయనకు సినిమా అవకాశాలు వస్తూనే ఉన్నాయి ఇప్పుడు. ఇక మరో హీరో రాజ్ తరుణ్ కూడా ప్రేక్షకులను అలరించడానికి వరుస సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఆయన హిట్ సాధించి చాలా కాలం అవుతున్న కూడా ఇప్పటికీ అవకాశాలు రావడం విశేషం. అంతే కాదు విశ్వక్ వంటి కొంతమంది హీరో లు కూడా మంచి మంచి అవకాశాలను అందుకుంటూ తమ కెరీర్ ను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: