టాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ నటులుగా ఒక్కో సినిమాతో ఎంతో గొప్ప క్రేజ్, పాపులారిటీ దక్కించుకుంటున్న నటుల్లో సూపర్ స్టార్ మహేష్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముందు వరుసలో ఉంటారు అనే చెప్పాలి. ఇక ఇటీవల సరిలేరు నీకెవ్వరు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్ లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాటని ఏప్రిల్ 1న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి పరశురామ్ పెట్ల దర్శకుడు. దీని తరువాత త్రివిక్రమ్, రాజమౌళి, కొరటాల శివ లతో సూపర్ స్టార్ పని చేయనున్నారు.
మరోవైపు మూడేళ్ళ క్రితం అరవింద సమేత మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ కొట్టిన యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రస్తుతం రామ్ చరణ్ తో కలిసి చేసిన ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ మార్చి 18న లేదా ఏప్రిల్ 28న రిలీజ్ కానుందని ఇటీవల యూనిట్ ప్రకటించింది. దీని తరువాత కొరటాల శివ తో నెక్స్ట్ సినిమా చేయనున్న ఎన్టీఆర్, ఆ పైన ప్రశాంత్ నీల్, అట్లీ వంటి దర్శకులతో కూడా వర్క్ చేయనున్నారు. అయితే అసలు విషయం ఏమిటంటే మొదటి నుండి అటు నందమూరి, ఇటు ఘట్టమనేని ఫ్యామీలీల మధ్య మంచి అనుబంధం ఉంది. సీనియర్ ఎన్టీఆర్, కృష్ణ ఇద్దరూ కలిసి పలు సినిమాల్లో నటించి ప్రేక్షకాభిమానులని అలరించారు. అయితే ప్రస్తుత జనరేషన్ లో ఎన్టీఆర్, మహేష్ లు కలిసి ఒక సినిమా చేస్తే చూడాలని ఆయా ఫ్యామిలీల అభిమానులతో పాటు ఆడియన్స్ అందరూ కూడా ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నారు.

అయితే త్వరలో అది జరిగే ఛాన్స్ కూడా లేకపోలేదని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో వీరిద్దరూ కలిసి త్వరలో ఒకప్పటి పౌరాణిక సినిమా కృష్ణార్జున విజయంలో నటించనున్నారు అనేది లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. కొన్నేళ్ల క్రితం బాలయ్య హీరోగా తెరకెక్కిన కృష్ణార్జున విజయం సినిమా మంచి విజయం అందుకుంది. కాగా త్వరలో ఈ మూవీ రీమేక్ కానుండగా ఇందులో కృష్ణుడిగా మహేష్, అర్జునుడిగా ఎన్టీఆర్ నాయించనున్నారని టాక్. కాగా దీనికి సంబంధించి అప్పుడే కొందరు ఫ్యాన్స్ ఒక ఎడిటెడ్ ఫోటోని తయారుచేసి సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారు. ఆ ఫోటో చూసినవారందరూ కూడా నిజంగానే ఎన్టీఆర్, మహేష్ కలిసి శ్రీకృష్ణార్జున విజయం సినిమా చేస్తున్నారేమో అని భావిస్తున్నారు. అయితే ఈ వార్తలో ఏ మాత్రం నిజం లేదని, ప్రస్తుతం అటు మహేష్, ఇటు ఎన్టీఆర్ ఇద్దరూ కూడా తమ లేటెస్ట్ కమిట్మెంట్స్ తో ఎంతో బిజీగా ఉన్నారని, ఇది ఒట్టి పుకారు మాత్రమే అని వారి సన్నిహితులు దీనిని కొట్టిపారేసినట్లు సమాచారం. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందొ తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: