మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రాజమౌళి దర్శకత్వంలో త్రిబుల్ ఆర్ సినిమాని పూర్తి చేసిన చరణ్ ప్రస్తుతం దక్షిణాది సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఈ ఏడాది రామ్ చరణ్ నుంచి వరుస సినిమాలు రాబోతున్నాయి. అందులో ముఖ్యంగా త్రిబుల్ ఆర్, ఆచార్య ఈ రెండు సినిమాలు తక్కువ గ్యాప్ లోనే సందడి చేయబోతున్నాయి. మల్టీ స్టారర్స్ గా రూపొందిన ఈ రెండు సినిమాల పై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

మరోవైపు ప్రస్తుతం శంకర్ దర్శకత్వం లో రామ్ చరణ్ నటిస్తున్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుండగా.. అంజలి, సునీల్, జయరామ్, శ్రీకాంత్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ భారీ బడ్జెట్ సినిమాకు సంబంధించి ఒక షెడ్యూల్ చిత్రీకరణ పూర్తయింది. కాగా తాజా సమాచారం ప్రకారం రామ్ చరణ్ పుట్టిన రోజును పురస్కరించుకుని మార్చి 27వ తేదీన చరణ్ పాత్ర తాలూకు గ్లిమ్స్ ను రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుందట.

ఇందులో రామ్ చరణ్ నెవర్ బిఫోర్ లుక్లో మెస్మరైజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు చరణ్ ఫస్ట్ గ్లిమ్స్ కు సంబంధించి ఇప్పటికే చిత్ర యూనిట్ వర్క్ కూడా స్టార్ట్ చేసిందట. భారీ బడ్జెట్ తో విజువల్ ట్రీట్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక రామ్ చరణ్ కెరీర్ లో అతనికి ఇది 15 సినిమా కావడం ఒక ఎత్తయితే.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజుకు నిర్మాతగా ఇది 50వ సినిమా కావడం మరో ఎత్తు. దీంతో ఈ సినిమాపై ఆడియన్స్ లో కూడా ఓ రేంజిలో అంచనాలు ఉన్నాయి.ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉండబోతోందని చిత్ర యూనిట్ చెబుతోంది. 2023 సంక్రాంతి కానుకగా ఈ సినిమాని విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే నిర్మాత దిల్ రాజు ప్రకటించారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: