పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ రేంజి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని కలవడానికి ఎంతో మంది సినిమా ఇండస్ట్రీలోని వారు ఎదురుచూస్తూ ఉంటారు.  అలాగే పవన్ కళ్యాణ్ ని ఒక్కసారి అయిన కలిసి అతనితో మాట్లాడాలని ఎదురు చూసే వారు ఎంతో మంది సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు.  అలాగే పవన్ కళ్యాణ్ తో కలిసి ప్రయాణం చేసిన వారిలో ఎంతో మంది ఆయన గురించి ఎంతో గొప్పగా చెప్పిన సందర్భాలు అనేకం ఉన్నాయి.  

అలా పవన్ కళ్యాణ్ గురించి ఇప్పటి వరకు ఎంతో మంది సినీ ప్రముఖులు ఎన్నో సార్లు ఎన్నో విధాలుగా ఆయన పై ప్రశంసల వర్షం కురిపించారు.  ఇది ఇలా ఉంటే తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి నటుడిగా కమెడియన్ గా కొనసాగుతున్న ప్రియదర్శి కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు సోషల్ మీడియా ద్వారా చేశాడు.  

అసలు విషయంలోకి వెళితే... టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి నటుడు గా కొనసాగుతున్న ప్రియదర్శి తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిశారు. పవన్ కళ్యాణ్ తో కలిసి ప్రియదర్శి సరదాగా ఫోటోలు దిగాడు. అనంతరం ఆ ఫోటోలను ఫ్యాన్స్ తో పంచుకొని ప్రియదర్శి మురిసిపోయాడు. తాజాగా పవన్ కళ్యాణ్ తో దిగిన ఫోటోలను ప్రియదర్శి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి... ఎప్పటి మాదిరి గానే సారధి స్టూడియో లోకి షూటింగ్ కోసం వెళ్లాను. 

ఎక్కడ చూసినా హడావిడి, అందరి కళ్ళలో కూడా ఏదో సందడి. అందరి నోట కూడా ఒకే మాట పవన్ కళ్యాణ్ వస్తున్నారు. అంతే... పవన్ కళ్యాణ్ గారి తో ఒక మాట అయినా మాట్లాడాలి , వారు తీసిన జానీ సినిమా ఎంత నచ్చిందో చెప్పడానికి రోజు అంతా ఎదురు చూశాను.  దర్శకుడు హరీష్ శంకర్ వల్ల ఆ కోరిక నెరవేరింది.  నీకు కృతజ్ఞతలు హరీష్ శంకర్ అన్న.  పవన్ కళ్యాణ్ గారిని కలిసి మాట్లాడటం ఒక మర్చిపోలేని అనుభూతి అని ప్రియదర్శి సోషల్ మీడియా వేదికగా రాసుకొచ్చారు. తాజాగా ప్రియదర్శి చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: