అందాల ముద్దుగుమ్మ రీతూ వర్మ గురించి తెలుగు సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రీతు వర్మ 'పెళ్లి చూపులు' సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో పాటు రీతు వర్మ కు మంచి గుర్తింపును కూడా తీసుకు వచ్చింది. అలా పెళ్లి చూపులు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రీతూ వర్మ ఆ తర్వాత టక్ జగదీష్ , వరుడు కావలెను సినిమాలలో నటించింది. 

ఈ సినిమాలు ఈ ముద్దుగుమ్మకు విజయాలను తెచ్చి పెట్టలేక పోయాయి.  ప్రస్తుతం రీతు వర్మ,  శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న ఒకే ఒక జీవితం సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం రైతు వర్మ ఒకే ఒక జీవితం సినిమాపై చాలా ఆశలు పెట్టుకుంది. 

ఒకే ఒక జీవితం సినిమా కనుక మంచి విజయం సాధించినట్లు అయితే రీతూ వర్మ మళ్లీ ఫుల్ ఫామ్ లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.  ఇదిలా ఉంటే ఇప్పటికే ఒకే ఒక జీవితం సినిమా నుండి విడుదల అయిన టీజర్ ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. 

ఇలా సినిమాల ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న తెలుగు అమ్మాయి రీతూ వర్మ  సోషల్ మీడియా ద్వారా కూడా అభిమానులతో టచ్ లో ఉంటూ అనేక విషయాలను పంచుకుంటూ ఉంటుంది. ఇదిలా ఉంటే తాజాగా రీతూ వర్మ తన ఇన్ స్టా లో కొన్ని పిక్స్ ని పోస్ట్ చేసింది. 

తాజాగా  రీతూ వర్మ తన ఇన్ స్టా లో పోస్ట్ చేసిన పిక్స్ లో చాలా ట్రెడిషనల్ గా ఉన్న గ్రీన్ కలర్ శారీ ని కట్టుకొని , అంతే ట్రెడిషనల్ గా ఉన్న మెరూన్ కలర్ బ్లౌజ్ ను ధరించి,  మెడలో ఒక లాకెట్ ను వేసుకొని , అందమైన నవ్వుతో అంతే అందంగా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది.  రీతూ వర్మ కు సంబంధించిన ఈ ట్రెడిషనల్ ఫోటోలను చూసిన కొంతమంది నెటిజన్లు బ్యూటిఫుల్ , ఏంజెల్ , లవ్ సింబల్ ఎమోజి లను కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: